
న్యాచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’అంటూ ప్రేక్షకులను పలకరించాడు. సెంటిమెంట్ ప్రధానంగా సాగిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితేనేం వీకెండ్ లు ఫ్యామిలీలు ఆదరిస్తున్నారు. టాక్ తో సంభందం లేకుండా ముందుకు వెళ్తోంది. కొత్త డైరక్టర్స్ ని పరిచయం చేయడంలో ముందుండే నాని… మరోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటిలోకి కూడా రాబోతుంది.
ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని Netflix సొంతం చేసుకుంది. “హాయ్ నాన్న” జనవరి 5 నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఓ రకంగా ఇది చాలా స్పీడుగా వస్తున్నట్లే . మొదట సంక్రాంతికి స్ట్రీమింగ్ చేద్దామనుకున్నా..జనాల దృష్టి అంతా సంక్రాంతికి పెద్ద సినిమాలపై ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. హాయ్ నాన్న ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.ఇక తెలుగు తో పాటు సౌత్ లోని అన్ని భాషలకు గాను కలిపి 37 కోట్లకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. నజిమే అయితే నాని సినిమాకు ఈ రేంజ్ లో ఓటిటి రైట్స్ రావడం నిజంగా గ్రేటే.
ఇక ఈ మూవీ డిసెంబర్ 7 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన తర్వాత చాలా స్లోగా ఉందని, మెలోడ్రామా ఎక్కువైందని ఇలా రకరకాల కామెంట్స్ వచ్చాయి. అయితే కలెక్షన్స్ వైజ్ మాత్రం పికప్ అవుతూ వచ్చింది. ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా వీకెండ్ మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల విషయం ప్రక్కన పెడితే ఓవర్ సీస్ లో మాత్రం అదరకొట్టింది. ఈ చిత్రంలో తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాల చాలా మందికి నచ్చాయి.
తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ గా అందరి చేత కంట తడి పెట్టిస్తుంది. తండ్రీ కూతుళ్ల పాత్రలు ఆ ఇద్దరి నేపథ్యంలో పండే భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్. ప్రథమార్ధంలో ‘ఇక్కడ్నుంచి వెళ్లిపోదాం నాన్న’ అని చిన్నారి చెప్పడం, సెకండాఫ్ లో నువ్వు నిజమైన అమ్మవి కాదుగా అంటూ చిన్నారి హీరోయిన్ తో చెప్పడం, ‘ఎక్కడ తప్పు చేశాను నా ప్రేమ సరిపోవడం లేదా’ అని చిన్నారితో విరాజ్ చెప్పే సందర్భాలు క్లైమాక్స్ స్థాయి,ఎమోషన్స్ ని పండిస్తాయి.మేకర్స్. నాని కూడా ఈ సినిమాని తన భుజాల మీద వేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నాడు.