
`నేను లోకల్`, `హౌరా బ్రిడ్జ్`, `ఎంఎల్‌ఏ` ఫేమ్ హీరోయిన్ మనాలీ రాథోడ్ పండంటి బిడ్డకి జన్మనిచ్చారు. ఆమె ఆడబిడ్డకి నాలుగు రోజుల క్రితం సోమవారం జన్మనివ్వడం విశేషం. ఈ సందర్బంగా తన బిడ్డతోపాటు దిగిన ఫోటోని పంచుకున్నారు. ఆడబిడ్డ ఎంతో క్యూట్‌గా ఉంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. హీరోయిన్‌గా పలు సినిమాల్లో మెరిసిన మనాలీ రాథోడ్.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
`గ్రీన్ సిగ్నల్`, `ఓ స్త్రీ రేపు రా`, `నేను లోకల్`, `ఫ్యాషన్‌డిజైనర్`, `హౌరా బ్రిడ్జ్`, `ఎం ఎల్ ఏ` వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో, హీరోయిన్‌గా నటించి మెప్పించింది మనాలీ రాథోడ్. వెండితెరపై తన మార్క్ ని చాటుకుంది. అయితే హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో మ్యారేజ్ చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. హైదరాబాద్‌కి చెందిన మనాలీ రాథోడ్ 2019 నవంబర్‌లో విజిత్ వర్మను వివాహం చేసుకుంది. ఆయన బీజేపీ నాయకుడు.
కాగా వీరిది పెద్దలు కుదర్చిన ప్రేమ వివాహం. ఆ మధ్య కాలంలో మనాలీ ప్రెగ్నెంట్ గా ఉన్న పొటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. కాగా మనాలీ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది మనాలీ రాథోడ్..జూలై 18న పాపకి జన్మనివ్వగా ..ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో మనాలీకి ఆమె అభిమానులు, సెలబ్రిటీలు విషెస్ తెలియజేస్తున్నారు.