
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాల గురించి మాత్రమే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు విదేశీయులు కూడా సౌత్ ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సునామి సృష్టిస్తోంది.
అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో, హీరో యష్ కెజిఎఫ్ 2తో పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. వీరి సత్తా తెలియజేస్తూ బిజినెస్ టుడే మ్యాగజైన్ కవర్ పేజీపై అల్లు అర్జున్, రాజమౌళి, యష్ ఫోటోలని ఒకే ప్రేములో ప్రచురించింది. 'సౌత్రెన్ సునామి పేరుతో ఈ కవర్ పేజీ ప్రచురించారు. సౌత్ ఇండియన్ సినిమా స్థాయి 400 కోట్ల నుంచి 1200 కోట్ల బిజినెస్ కి ఎగబాకింది అని బిజినెస్ టుడే ప్రశంసలు కురిపించింది.
ఇది ఈ ముగ్గురికి దక్కిన అరుదైన గౌరవం అనే చెప్పాలి. బాహుబలితోనే తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన జక్కన్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోసారి సత్తా చాటాడు. వరల్డ్ వైడ్ గా ఆర్ఆర్ఆర్ చిత్రం 1100 కోట్లకి పైగా బిజినెస్ చేసింది. ఇక పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అల్లు అర్జున్ క్రేజ్ ఇండియా మొత్తం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. రీసెంట్ గా బన్నీ ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ పేజీలో కనిపించాడు. మరోసారి బిజినెస్ టుడేలో ఆ గౌరవం బన్నీకి దక్కింది. అల్లు అర్జున్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు అని దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇక కన్నడ హీరో యష్ కెజిఎఫ్ చిత్రంతో ఊహించని స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. కెజిఎఫ్ 2 ఇండియా వ్యాప్తంగా రీసౌండింగ్ విక్టరీ అందుకుంది. దీనితో బిజినెస్ టుడే కవర్ పేజీపై యష్ కి కూడా అవకాశం దక్కింది.