
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తొలిసారిగా పాన్ ఇండియన్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. ‘లైగర్ : సాలా క్రాస్ బ్రీడ్’ టైటిల్ తో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్ లో రూపుదద్దుకుందీ చిత్రం. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) రౌడీ హీరో సరసన ఆడిపాడింది. ఈ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ మూవీ కోసం ఆడియెన్స్ ఇప్పటికే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విడుదైన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నిన్న వచ్చిన ‘ట్రైలర్’కు మాత్రం మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది.
ట్రైలర్ లో విజయ్ దేవరకొండ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. సెక్సీ ఫిట్ నెస్ తో, మాస్ అటీట్యూడ్ తో విజయ్ సినిమాపై అంచనాలను పెంచేశాడు. 24 గంటలు గడవకముందే మిలియన్ల వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ ట్రైలర్. తొలి రెండున్నర గంటల్లోనే 7 మిలియన్ల వ్యూస్, 5 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఒకరోజు తర్వాత లైగర్ ట్రైలర్ (Liger Trailer) రెస్పాన్స్ చూస్తే దిమ్మతిరిగిపోతోంది. ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ తో మాస్ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. #1తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఇంకా మిలియన్ల వ్యూస్ ను పొందుతోంది.
Liger మూవీని తెలుగు, హిందీలో నిర్మించారు. ఈ రెండు భాషలతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ క్రేజీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ మూవీతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అనన్య పాండే కూడా సౌత్ కు పరిచయం కానుంది. చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్, పూరీ కనెక్ట్స్ కంపెనీలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతలుగా కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, అపూర్వ మెహతలు వ్యవహరించారు.
లైగర్ శాటిలైట్ రైట్స్ ను స్టార్ నెట్ వర్క్, డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థలు మంచి డీల్ కు దక్కించుకున్న విషయం తెలిసిందే. లైగర్ ఆల్బమ్ హక్కులను కూడా సోనీ మ్యూజిక్ సొంతం చేసుకుంది. మూవీలో టాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ రమ్యక్రిష్ణ, అమెరికన్ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబయి గల్లీ బాయ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ ఎలా అయ్యాడన్నది సినిమా కథగా తెలుస్తోంది.