వైసీపీ నుంచి జనసేన లోకి 30 ఇయర్స్ యాక్టర్, పశ్చాత్తాపంలో పృథ్వీరాజ్

Published : Jun 27, 2022, 02:18 PM IST
వైసీపీ నుంచి జనసేన లోకి  30 ఇయర్స్  యాక్టర్,  పశ్చాత్తాపంలో పృథ్వీరాజ్

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లో చాలా మంది ఉన్నారు. అప్పుడప్పుడు పార్టీలు మారుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఆ వంతు 30 ఇయర్స్ పృథ్వీ వంతు వచ్చింది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఈ కామెడీ స్టార్.. పార్టీ మారుతున్నారు.   

కమెడియన్ గా పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇమేటేటింగ్ లో.. కామెడీ టైమింగ్ లో ఆయన మార్క్ డిఫరెంట్ గా ఉంటుంది. పృథ్విరాజ్ ఇండస్ట్రీలో కొనసాగినంత వరకూ బాగానే ఉంది. కాని రాజకీయాల్లోకి వెళ్ళడం ఆయన జీవితాన్నే మార్చేసింది. ముందుగా వైసీపీలో చేరి ఆపై ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన నటుడు పృథ్వీ ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని అనూహ్య రీతిలో తిరిగి టాలీవుడ్‌కు చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. 

అయితే  రాజకీయాల ప్రభావంతో సినిమాలకు గ్యాప్ రావడంతో ఇదివరకట్లా అవకాశాలు అందటంలేదు పృద్వీకి. దాంతో సినిమా ప్రయత్నాలు గట్టిగా చేస్తూనే.. పాలిటిక్స్ లో కంటీన్యూ అవ్వాలని చూస్తున్నాడు. ఇక తాజాగా... ఓ  కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీ పలు సంచలన విషయాలు వెల్లడించారు.వైసీపీ క్యాంపును ఉగ్రవాద శిక్షణ శిబిరంతో పోల్చిన పృథ్వీ.. ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో తాను గొప్పవాడినన్న గర్వం పెరిగిందని, దీంతో ఎవరినీ లెక్క చేయకుండా అనరాని మాటలు అన్నానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

చిరంజీవి, పవన్ కల్యాణ్, చంద్రబాబు వంటి వారిని కూడా అనరాని మాటలు అన్నానని, అయితే, వాళ్లెవరూ సీరియస్‌గా తీసుకోలేదని, సహృదయంతో తనను అర్థం చేసుకున్నారని అన్నారు. తాను తప్పు చేశానని, మీ కాళ్లకు దండం పెడతానని చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుకు చెప్పానని గుర్తు చేసుకున్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, అయిపోయిందేదో అయిపోయిందని, సినిమాల్లో ట్రై చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని వారు తనకు సూచించారని అన్నారు. 2024లో ఓ మంచి బస్సెక్కి సపోర్ట్ చేయమన్నారని చెప్పుకొచ్చారు. 

తాను జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని.. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్‌తో చెబితే తప్పకుండా పిలుస్తానని, ప్రస్తుతానికి సినిమాలు చేసుకోవాలని సూచించారని పృథ్వీ అన్నారు. ఇప్పుడు తనపై తనకు ఓ అంచనా వచ్చిందని, సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఇండస్ట్రీలోని పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఎవరినీ నొప్పించకుండా ఉండాలని, వీలైతే సాయం చేయాలని అనుకుంటున్నానని, ఈ జీవితానికి ఇది చాలని పృథ్వీ ఆ షోలో పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..
Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్