ఆకట్టుకున్న రంగరంగ వైభవంగా టీజర్, కొత్త వైష్ణవ్ కనిపించాడంటూ కామెంట్లు

Published : Jun 27, 2022, 01:29 PM ISTUpdated : Jun 27, 2022, 01:48 PM IST
ఆకట్టుకున్న రంగరంగ వైభవంగా టీజర్,  కొత్త వైష్ణవ్ కనిపించాడంటూ కామెంట్లు

సారాంశం

మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా  సినిమా రంగరంగ వైభవంగా. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమాలో హాట్ బ్యూటీ కేతిక శర్మ వైష్ణవ్‌తో జోడీ కట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ రిలీజైంది.   

మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా  సినిమా రంగరంగ వైభవంగా. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ  సినిమాలో హాట్ బ్యూటీ కేతిక శర్మ వైష్ణవ్‌తో జోడీ కట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ రిలీజైంది. 

డెబ్యూ సినిమాతో రికార్డులు సృష్టించాడు మెగా మెన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌. ఉప్పెన సినిమాతో ఉప్పెన‌లాంటి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. త‌రువాత వ‌చ్చిన కొండ‌పొలం` ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన మూవీ రంగ‌రంగ వైభ‌వంగా. అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్ ఆదిత్య వ‌ర్మ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గిరీశ‌య్య ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌లో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలో మూవీ టీమ్ ఎప్పటికి అప్పుడు ఏదో  ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తుంది. ఇక తాజాగా మేక‌ర్స్ రంగరంగ వైభవంగా మూవీ నుంచి  టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ మూవీ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. 

 

న‌న్నే చూస్తావ్.. నా గురించే క‌ల‌లు కంటావ్‌.. నన్నే ప్రేమిస్తావ్.. కానీ నీకు నాతో మాట్లాడ‌టానికి ఇగో అంటూ కేతిక చెప్పే డైలాగ్స్‌తో టీజ‌ర్ మొద‌ల‌యింది. దీన‌మ్మ జీవితం మాన‌వ‌త్వం చ‌చ్చిపోయింది భ‌య్యా అంటూ వైష్ణ‌వ్ డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. రేయ్ బామ్మ‌ర్ది ఈ వంక‌ర‌మాట‌లే వ‌ద్దనేది అంటూ ఆలి చెప్పే డైలాగ్ న‌వ్విస్తుంది.  ఇలా టీజ‌ర్ మొత్తం సంద‌డి సంద‌డిగా సాగింది. 

ఇక చివ‌ర్లో వైష్ణ‌వ్ తేజ్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. హీరో ఫైటింగ్ సీన్  బాగుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. టీజ‌ర్‌లోనే ఇంత ఎంట‌ర్టైన్‌మెంట్ ఉంటే సినిమాలో ఏ లెవ‌ల్లో ఉంటుందో అని నెటీజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు.మొత్తానికి టీజర్‌ మాత్రం ఇంట్రస్టింగ్‌ ఉంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. శామ్‌దత్‌ సైనుద్దీన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్