`బిగ్‌బాస్‌5`లోకి టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు ఎంట్రీ ?

Published : Feb 09, 2021, 05:03 PM IST
`బిగ్‌బాస్‌5`లోకి టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు ఎంట్రీ ?

సారాంశం

టిక్‌ టాక్‌తో పాపులర్‌ అయ్యారు దుర్గారావు. ఇప్పుడాయన్ని టిక్‌ టాక్‌ స్టార్‌ దుర్గారావు అని పిలుస్తున్నారంటే ఆయన ఎంతగా పాపులారిటీని తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఇంటర్వ్యూలు, టీవీ షోస్‌లో సందడి చేస్తున్నారు దుర్గారావు జోడి. ఇటీవల రవితేజ నటించిన `క్రాక్‌` చిత్రంలో కాసేపు మెరిశాడు దుర్గారావు, 

టిక్‌ టాక్‌తో పాపులర్‌ అయ్యారు దుర్గారావు. ఇప్పుడాయన్ని టిక్‌ టాక్‌ స్టార్‌ దుర్గారావు అని పిలుస్తున్నారంటే ఆయన ఎంతగా పాపులారిటీని తీసుకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఇంటర్వ్యూలు, టీవీ షోస్‌లో సందడి చేస్తున్నారు దుర్గారావు జోడి. ఇటీవల రవితేజ నటించిన `క్రాక్‌` చిత్రంలో కాసేపు మెరిశాడు దుర్గారావు, దీంతోపాటు ఈ నెల 12న విడుదల కాబోతున్న `ఎఫ్‌సియుకే` చిత్రంలోనూ చిన్న పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో స్టేజ్‌పై సందడి చేశారు. జగపతిబాబు చేత ప్రశంసలందుకున్నారు. 

తాజాగా మరో బంపర్‌ ఆఫర్‌ దుర్గారావుని వరించినట్టు తెలుస్తుంది. ఆయన ఈ ఏడాది నిర్వహించే పాపులర్‌ రియాలిటీ షో `బిగ్‌బాస్‌`లో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. నిజానికి గత సీజన్‌లోనే దుర్గారావు పేరు వినిపించింది. కానీ ఐదో సీజన్‌లో ఆయన్ని ఎంపిక చేయాలని నిర్వహకులు భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో విడిపిస్తుంది. ఇదే నిజమైతే టిక్‌ టాక్‌ స్టార్‌ దుర్గారావు నిజంగానే పెద్ద స్టార్‌ అయిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిగ్‌బాస్‌ 5లో కంటెస్టెంట్‌గా ఎంపికైతే అందరి దృష్టిలో పడతాడని చెప్పొచ్చు. మరోవైపు ఈ ఐదో సీజన్‌కి యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌, యాంకర్‌ రవి, హాస్యనటుడు హైపర్‌ ఆది పేర్లు వినిపిస్తున్నాయి. దుర్గారావు తన భార్యతో కలిసి పలు అలనాటి పాటలకు డాన్స్ లు వేసి టిక్‌టాక్‌లో పాపులర్‌ అయిన విషయం తెలిసందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా