ఫ్యాన్స్ కు అల్లు అరవింద్ ‘ఆహా..’ ఆనంద లేఖ!

Surya Prakash   | Asianet News
Published : Feb 09, 2021, 05:01 PM IST
ఫ్యాన్స్ కు అల్లు అరవింద్  ‘ఆహా..’ ఆనంద లేఖ!

సారాంశం

ప్రముఖ నిర్మాత,పంపిణీదారుడు అల్లు అరవింద్ తన సినిమాలు సూపర్ హిట్టైనప్పుడు కూడా ఇంత ఆనందపడలేదేమో. ఇప్పుడు గాలిలో తేలుతున్నట్లుగా ఉన్నారు. ఊహించని విధంగా అతి తక్కువ కాలంలోనే  ‘ఆహా..’ తెలుగులో నిలదొక్కుకుంది. మొదట్లో అసలు కంటెంటే లేదు,విషయం లేదు అనిపించుకున్న ఈ యాప్ ..ఇప్పుడు చాలా మంది తెలుగువాళ్లకు ప్రతీ శుక్రవారం,వీకెండ్స్ ఆనందాన్ని పంచుతోంది.  అల్లు అరవింద్ నేతృత్వంలో ఆరంభించబడిన ఈ యాప్ ఏడాది పూర్తి చేసుకోడంతో అల్లు అరవింద్ తమ అభిమాన ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ లెటర్ నే రాసారు.

ఆహా అనేది పెద్ద కుటుంబం అయ్యినందుకు చాలా సంతోషిస్తున్నాని అందుకే తమ వీక్షకులను తమ కుటుంబంగానే భావిస్తున్నాని వినోదం అంటే మనకు ఇష్టం, తెలుగు అంటే ఇంకా ఇష్టం అందుకే రెండు కలగలిపిన ఆహా ను ఆదరించడం వలనే తమకు కృతజ్ఞులం అని తెలిపారు. అలాగే జూపల్లి రామేశ్వర్ గారికి, రాము గారికి మరియు ఆహా యాప్ కోసం పని చేస్తున్న సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని అల్లు అరవింద్ ఆ లేఖ ద్వారా తెలిపారు. 

ఆ లేఖ యధాతథంగా..

‘‘ప్రియమైన కుటుంబ సభ్యులకు

అలా ఎందుకు అంటున్నాను అంటే.. ఈ రోజు ‘ఆహా’ అనేది ఓ పెద్ద కుటుంబం అయినందుకు సంతోషంగానూ గర్వంగానూ ఉంది. మీ ప్రేమ ఆదరణ వల్ల ఈ రోజు ‘ఆహా’ మొదటి వార్షికోత్సవం చేసుకుంటున్నది. ఈ ‘ఆహా’ కుటుంబంలో మనమందరమూ సభ్యులమే కదా!

వినోదం అంటే మనకు ఇష్టం - తెలుగు అంటే ఇంకా ఇష్టం. రెండూ కలిసిన ఈ ‘ఆహా’ను విజయవంతంగా నడిపిస్తున్న మీకు మేము ఎంతయినా కృతజ్ఞులం.

శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారరికి రాము గారికి మాతో కలిసి నడిచే మా భాగస్వాములందరికీ ఇంత వేగంగా దీనిని తీసుకు రావడానికి నిర్విరామంగా పనిచేసిన మా సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు

ప్రేమతో
అల్లు అరవింద్’’
అంటూ లేఖను ముగించారు 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా