Tiger Shroff : కొత్త స్టెప్ లతో ఆకట్టుకుంటున్న టైగర్ ష్రాఫ్, లైకులతో ముంచెత్తుతున్న అభిమానులు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 14, 2022, 02:24 PM ISTUpdated : Jan 14, 2022, 02:54 PM IST
Tiger Shroff : కొత్త స్టెప్ లతో  ఆకట్టుకుంటున్న టైగర్  ష్రాఫ్, లైకులతో ముంచెత్తుతున్న అభిమానులు

సారాంశం

బాలీవుడ్  అగ్రహీరోలతో పోటీ పడుతున్న టైగర్  ష్రాఫ్ తన డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్ తో  ఎప్పటికప్పుడు అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు.   

బాలీవుడ్ అగ్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలతో దూసుకువెళ్తున్న టైగర్  ష్రాఫ్ ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం ఏదో ఒక సాహసం చేస్తూనే ఉంటాడు. అందులో భాగంగానే ఇస్టా వేదికన తన డ్యాన్, మార్షల్ ఆర్ట్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నాడు. తన డ్యాన్ కు, సరికొత్త స్టెప్ లకు డ్యాన్ లవర్స్  ఎంతో  ఆకర్షితులవుతుంటారు. 

టైగర్ శ్రాఫ్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు కోరుకునే ప్రధాన అంశాల్లో డ్యాన్, స్టంట్స్ ఉంటాయి. అందుకు తగినట్టుగానే తన ప్రతి సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఉధ్వేగ భరితమైన ఫైట్ సీన్స్ ఉంటాయి. ఊపందించే డ్యాన్స్ కు, సాహసోపేతమైన  స్టంట్స్ కు అభిమానులు  ఫిదా కావాల్సిందే.

జూన్ 2012లో తొలి చిత్రం ‘హీరోపంతి’తో బాలీవుడ్ ఆడియెన్స్ మనస్సును దోచుకున్నాడు టైగర్  ష్రాఫ్. ఇటు సినిమాకు పెట్టిన పెట్టుబడితోపాటు అదనంగా కాసుల వర్షం కురిసింది.  అందుకు ప్రధాన కారణం కథాంశం ఒకెత్తైతే టైగర్ డ్యాన్ స్కిల్స్, యాక్షన్ సీక్వెన్స్, స్టన్నింగ్ సిక్స్ ప్యాక్ బాడీతో కఠిన విన్యాసాలు చేయడం.  

ఆపై తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తున్నారు టైగర్ శ్రాఫ్. బాగీ, ఫ్లైయింగ్ జెట్, బాగీ 2, స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ సినిమాలతో తన నటనా శైలితో, సాహసోపేతమైన సీన్లతో  అందరి మన్ననలు పొందారు. ప్రతి సినిమాలో ఏదో రకమైన యాక్షన్ సీన్ ఉండేలా చూస్తుకుంటారు టైగర్.  అందుకే తన సినిమాలు చాలా  ఆసక్తి  భరితంగా  ఉంటాయి. 

టైగర్  ష్రాఫ్ కు డ్యాన్, మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంత ఇస్టమో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అయితే తనకు బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ అంటే  ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.  ఆయనతో  2019లో రిలీజైన వార్ మూవీతో  టైగర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. టాప్ పేయిడ్ యాక్టర్స్ లిస్ట్ లో చేరాడు. 

కాగా 2015లో ‘జిందగీ ఆ రహా హూన్’ స్పెషల్ సాంగ్  ఆల్బమ్ తో పెద్ద హిట్ కొట్టారు. ఇందులో అతిఫ్ అస్లాం నటించగా,  అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఆల్బమ్‌లో టైగర్ ష్రాఫ్ తన డ్యాన్స్ స్కిల్స్‌కు ప్రశంసలు అందుకున్నాడు.  ఆ తరువాత ‘బేఫిక్రా’ చేశారు. ఇలా  ఆల్బమ్స్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలోనూ తన డ్యాన్స్, స్టంట్స్ వీడియోలను అప్లోడ్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి