నాకు విపరీతంగా నచ్చేసింది.. 'హీరో' మూవీపై మహేష్ బాబు రివ్యూ ఇదిగో

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 14, 2022, 02:11 PM IST
నాకు విపరీతంగా నచ్చేసింది.. 'హీరో' మూవీపై మహేష్ బాబు రివ్యూ ఇదిగో

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అశోక్ కి జంటగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అశోక్ కి జంటగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మకర సంక్రాంతి సందర్భంగా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఇలాంటి తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగి అంచనాలని మరింతగా పెంచేశాడు. మహేష్ బాబు 'హీరో' చిత్రం చూసిన అనంతరం తన రివ్యూ తెలియజేస్తూ వీడియో బైట్ విడుదల చేశారు. 

'హీరో మూవీ చూశాను. నాకు విపరీతంగా నచ్చేసింది. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. ముఖ్యంగా అశోక్ కి.. ఐదేళ్లపాటు అశోక్ ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. సంక్రాంతి పండగ నాకు, నాన్నగారికి చాలా బాగా కలసి వచ్చింది. నాన్నగారు సంక్రాంతికి ఏ సినిమా రిలీజ్ చేసినా సూపర్ హిట్ అయ్యేవి. అలాగే నేను నటించిన ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించాయి అని మహేష్ పేర్కొన్నాడు. 

తనని, నాన్నగారిని ఆదరించినట్లుగానే అశోక్ ని కూడా ఆదరించాలని మహేష్ బాబు ఫ్యాన్స్ ని కోరారు. రేపటి నుంచి హీరో మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. మహేష్ స్వయంగా హీరో మూవీపై రివ్యూ ఇవ్వడంతో అంచనాలు రెట్టింపు అవుతాయనడంలో సందేహం లేదు. 

 

PREV
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌