‘థగ్స్ ఆఫ్‌ హిందుస్థాన్‌’కు ఇంకో దెబ్బ ...చైనా వాళ్లు చేతులెత్తేసారు

By Udayavani DhuliFirst Published Nov 21, 2018, 10:46 AM IST
Highlights

పెద్ద సినిమా డిజాస్టర్ అయితే పరిస్దితులు చాలా దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ ,ఎగ్జిబిటర్స్ నుంచి డబ్బు వెనక్కి ఇవ్వమని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 

పెద్ద సినిమా డిజాస్టర్ అయితే పరిస్దితులు చాలా దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ ,ఎగ్జిబిటర్స్ నుంచి డబ్బు వెనక్కి ఇవ్వమని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే  ‘థగ్స్ ఆఫ్‌ హిందుస్థాన్‌’నిర్మాతలు ఆ పరిస్దితి ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారికి మరో కొత్త సమస్య ఎదురైంది. అదే చైనా మార్కెట్. 

గత కొంతకాలంగా అమీర్‌ఖాన్‌ నటించిన చిత్రాలకు భారత్‌లో మాత్రమే కాదు చైనా, జపాన్‌ వంటి దేశాల్లో ఓ రేంజిలో క్రేజ్‌ ఉంది. అందుకు ఉదాహరణ ఆయన ‘పీకే’, ‘దంగల్‌’ చిత్రాలు చైనాలో మంచి బిజినెస్ చేయటమే. అదే పద్దతిలో అమీర్ ఖాన్ హీరోగా యశ్‌రాజ్‌ ఫిలింస్‌ పతాకంపై రూపొందిన ‘థగ్స్ ఆఫ్‌ హిందుస్థాన్‌’ చిత్రం పై నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. 110 కోట్లకు అక్కడ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఈస్టర్ ఫిలింస్ తో బిజినెస్ చేసారు. అయితే ఇప్పుడు వారు ఇండియాలో ఈ సినిమా డిజాస్ట్రర్ అవటం చూసి వెనక్కి తగ్గారట. 

ఎగ్రిమెంట్స్ తిరిగి రాసుకున్నాకే రిలీజ్ చేద్దామని అంటున్నారట. రెవిన్యూ షేర్ పద్దతిన రిలీజ్ చేస్తాం కానీ సినిమాని డబ్బు ఇచ్చి కొనుక్కోలేం అని తేల్చేసారట. దాంతో యశ్ రాజ్ ఫిలింస్ వారు డీలా పడిపోయారు. ఇక్కడా బిజినెస్ పోయింది. చైనాలో పరిస్దితి అలా ఉంది. అన్ని వైపుల నుంచి ఈ సినిమా ముంచేసిందని బాధపడుతున్నారట. 

విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమితాబచ్చన్‌, కత్రీనాకైప్‌, ఫాతిమాసనా షేక్‌లు కీలకపాత్రల్లో కనిపించారు. నవంబర్‌ 7న విడుదల అయ్యింది హాలీవుడ్‌ స్థాయిలో రూపొందింది అని ప్రచారం జరిగిన  ఈ సినిమాలో రెండు లక్షల కిలోల బరువున్న భారీ పడవలను ఏడాది నుంచి తయారుచేశారరు. యూరప్‌లోని మాల్దా సమీపంలో షూటింగ్ చేసారు. విజువల్‌ ఎఫెక్ట్‌లు కూడా భారీగా  ఉన్నాయి.  అయితే ఎన్ని ఉన్నా...సినిమా లో విషయం లేకపోవటం దెబ్బ కొట్టింది. 

 

click me!