మహేష్ నిజాయితీ... మొత్తం వడ్డీతో వెనక్కి ఇచ్చేద్దామనే నిర్ణయం!

By Udayavani DhuliFirst Published Nov 21, 2018, 10:07 AM IST
Highlights

ఫామ్ లో ఉన్న స్టార్ హీరోని లాక్ చెయ్యటం కోసం పెద్ద పెద్ద నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసుకుంటూంటారు. భవిష్యత్ లో చేయబోయే  ప్రాజెక్టుల నిమిత్తం డేట్స్ ఇమ్మని అడుగుతూంటారు

ఫామ్ లో ఉన్న స్టార్ హీరోని లాక్ చెయ్యటం కోసం పెద్ద పెద్ద నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసుకుంటూంటారు. భవిష్యత్ లో చేయబోయే  ప్రాజెక్టుల నిమిత్తం డేట్స్ ఇమ్మని అడుగుతూంటారు. అయితే అడ్వాన్స్ తీసుకుని సినిమా చెయ్యలేకపోతే ..ఆ మొత్తాన్ని ..వడ్డీతో సహా తిరిగి వెనక్కి ఇచ్చేస్తూంటారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కు అలాంటి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్దితే ఎదురైంది. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బిజినెస్ మెన్ సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు..ఐదు కోట్ల అడ్వాన్స్ తీసుకున్నారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ కు చెందిన ఆర్ .ఆర్ వెంకట్ ఆ మొత్తాన్ని మహేష్ కు అడ్వాన్స్ గా ఇచ్చారు. అప్పటికి అది చాలా పెద్ద మొత్తం క్రింద లెక్క. మహేష్, పూరి తో బిజినెస్ మ్యాన్ తో హిట్ కొట్టాక వీరిద్దరి కాంబోలో మళ్లీ అదే ప్రొడక్షన్ హౌస్ లో ఓ సినిమా అనుకున్నారు.

అయితే రకరకాల కారణాలతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. అయితే అప్పటి నుంచి ఆ అడ్వాన్స్ అలాగే ఉండిపోయిందిట. ఇప్పుడు ఆ ఎమౌంట్ ని మహేష్ తిరిగి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే ఆర్.ఆర్ వాళ్లు ముందుకువచ్చి సినిమా చేద్దామనుకున్నా...తన డేట్స్ ఖాళీ లేవు. అలాగని వడ్డీతో సహా ఇవ్వాలంటే దాదాపు పదిహేను కోట్లుదాకా అవుతుందని లెక్క కట్టారట.

ఈ విషయమై ఆర్.ఆర్ .వెంకట్ తో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుందామని మహేష్ ఆలోచనగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ మొత్తం అలా ఉండిపోతే అప్పు తీసుకుని వడ్డీ కట్టినట్లే అవుతుందని భావిస్తున్నారట. ఈ విషయమై మహేష్ చాలా నిజాయితీగా ముందుకు వెళ్తున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. అందుకనే కదా ఇప్పటిదాకా మహేష్ పై ఎలాంటి ఆరోపణలు లేవు. చాలా క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉంది. 

click me!