ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలివే.. అందరి చూపు ఆ మూవీపైనే

Published : Jun 02, 2025, 01:02 PM IST
thug life, tourist family

సారాంశం

ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రాబోతున్న సినిమాలేంటో ఇందులో తెలుసుకుందాం. ముఖ్యంగా కమల్‌ మూవీ, `టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రాలపై అందరి చూపు ఉంది.

ఈ ఏడాది సమ్మర్‌ నిరాశ పరిచింది. ఒక్క `హిట్‌ 3` మూవీ తప్ప పెద్ద సినిమాలేవి తెలుగులో ఆడలేదు. వచ్చిన కొన్ని సినిమాలు ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు జూన్‌ నెలలో మాత్రం భారీ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. 

వారానికి ఒక్కో భారీ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ వారం ఓ పెద్ద సినిమాతోపాటు నాలుగైదు చిన్న చిత్రాలు థియేటర్లో సందడి చేయడానికి రాబోతున్నాయి. అలాగే మరికొన్ని చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీలో రచ్చ చేయనున్నాయి.

ఈవారం అందరి చూపు కమల్‌ హాసన్‌ `థగ్‌ లైఫ్‌` పైనే

ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాల్లో కమల్‌ హాసన్‌ `థగ్‌ లైఫ్‌` ప్రధానంగా ఉంది.  దీనికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 38ఏళ్ల తర్వాత కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌లో ఈ మూవీ వస్తుండటం విశేషం. శింబు, త్రిష, అభిరామి, నాజర్‌, అశోక్‌ సెల్వన్‌, తనికెళ్ల భరణి వంటి వారు ఇందులో నటిస్తున్నారు. 

జూన్‌ 5న(గురువారం) ఈ చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. దీంతో అందరి చూపు ఈ మూవీపైనే ఉందని చెప్పొచ్చు.

`మ్యాడ్‌` బాయ్స్ నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌ ల మధ్య పోటీ

ఇక ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నట్టు సినిమాల్లో ఎన్టీఆర్‌ బావమరిది, `మ్యాడ్‌` చిత్రంతో అలరించిన నార్నే నితిన్‌ నటించిన `శ్రీ శ్రీ శ్రీ రాజావారు` మూవీ కూడా ఉంది. అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని ఎట్టకేలకు జూన్‌ 6న విడుదల చేయబోతున్నారు. 

`మ్యాడ్‌`లోనే నటించి నవ్వులు పూయించిన మరో హీరో సంగీత్‌ శోభన్‌ నటించిన `గ్యాంబ్ల‌ర్స్` మూవీ కూడా ఇదే రోజు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతో వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది.

`పాడేరు 12 మైలు`, `బద్మాషులు`, `హౌజ్‌ఫుల్‌ 5` సందడి..

వీటితోపాటు సత్యం రాజేష్‌ నటించిన హార్రర్‌ మూవీ `పాడేరు 12వ మైలు` సినిమా జూన్‌ 6న విడుదల కానుంది. మరో చిన్న చిత్రం `బద్మాషులు` మూవీ కూడా జూన్‌ 6న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.  థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తుంది. 

అలాగే హిందీ మూవీ `హౌజ్‌ఫుల్‌ 5` కూడా ఇదే రోజు రిలీజ్‌ కానుంది. హిందీ వెర్షన్‌ ని ఇక్కడ విడుదల చేస్తున్నారు. ఇందులో అక్షయ్‌ కుమార్‌, సంజయ్‌ దత్‌, జాక్వెలిన్‌, కృతి సనన్‌ వంటి భారీ స్టార్ కాస్టింగ్‌ ఉండటం విశేషం. ఇలా జూన్‌ 5న ఒక సినిమా, జూన్‌ 6న ఐదు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

సన్నీ డియోల్‌ `జాట్‌` ఈ వారం ఓటీటీలో సందడి..

ఇక ఓటీటీలోనూ చాలా సినిమాలే ఉన్నాయి. నెట్‌ ఫ్లిక్స్ లో సన్నీ డియోల్‌, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన `జాట్‌` మూవీ జూన్‌ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇది ఇప్పటికే మిగిలిన ఓటీటీల్లోకి రాగా, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది.

 వీటితోపాటు `డిపార్ట్ మెంట్‌ క్యూ` అనే ఇంగ్లీష్‌, తెలుగు వెబ్‌ సిరీస్‌ ఈ వారమే రాబోతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో `స్టోలెన్‌`(హిందీ) మూవీ జూన్‌ 4న స్ట్రీమింగ్‌ కానుంది. `వీరచంద్రహాస` అనే కన్నడ సినిమా ఈ వారం స్ట్రీమింగ్‌ కాబోతుంది.

`టూరిస్ట్ ఫ్యామిలీ` సడెన్‌ సర్ప్రైజ్‌

జియో హాట్‌ స్టార్‌లో తమిళంలో సంచలనం సృష్టించిన `టూరిస్ట్ ఫ్యామిలీ` మూవీ తెలుగు, తమిళ వెర్షన్స్ లో నేటి(జూన్‌ 2) నుంచే స్ట్రీమింగ్‌ అవుతుంది. అలాగే `గజానా(హిందీ) మూవీ సైతం నేటి నుంచే స్ట్రీమింగ్‌ అవుతుంది. వీటితోపాటు `దేవికా అండ్‌ డానీ` అనే తెలుగు వెబ్‌ సిరీస్‌ జూన్‌ 6 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.  

 `కెప్టెన్‌ అమెరికాః బ్రేవ్‌ న్యూ వరల్డ్` హాలీవుడ్‌ మూవీ తెలుగులో కూడా ఈ వారం జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. `ఆహా`లో `డెమన్‌` అనే తెలుగు సినిమా, `నిజార్‌ కుడాయ్‌`, `వానిల్‌ తెండియన్‌` అనే తమిళ చిత్రాలు ఈ వారం ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?