కోలీవుడ్‌లో విషాదం, ప్రముఖ దర్శకుడు విక్రమ్‌ సుకుమారన్‌ కన్నుమూత.. కారణం ఇదే

Published : Jun 02, 2025, 11:38 AM IST
Vikram Sugumaran

సారాంశం

దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో మరణించడం తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.

కోలీవుడ్‌ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుకుమారన్(45) కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన  సోమవారం ఉదయం  తుదిశ్వాస విడిచారు.

 మధురైలో ఓ నిర్మాతను కలిసి కొత్త సినిమాకి సంబంధించిన కథను చర్చించి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తుండగా విక్రమ్ సుకుమారన్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన బస్సులోనే మరణించారు. ఆయన మరణం తమిళ చిత్ర పరిశ్రమని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. .

ఎవరీ విక్రమ్ సుకుమారన్?

రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన విక్రమ్ సుకుమారన్‌ సినిమాపై ఆసక్తితో  చెన్నైకి వచ్చారు. 1999-2000 ప్రాంతంలో దర్శకుడు బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. బాలు మహేంద్ర దర్శకత్వంలో 2003లో వచ్చిన `జూలీ గణపతి` చిత్రానికి కూడా విక్రమ్ సుకుమారన్ పనిచేశారు.

సుధీర్ఘ ప్రయాణం తర్వాత దర్శకుడైన విక్రమ్ సుకుమారన్

దర్శకుడిగా ఛాన్స్ లు దొరక్కపోవడంతో నటుడిగా మారారు విక్రమ్ సుకుమారన్. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన `పొల్లదావన్‌` చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత శశికుమార్` కొడివీరన్` చిత్రంలో నటించిన ఆయనకు 2013లో దర్శకత్వం వహించే అవకాశం లభించింది. 

కాతిర్, ఓవియా నటించిన ‘మధ యెన్నై కూట్టమ్‌’ చిత్రం ద్వారా దర్శకుడిగా కోలీవుడ్‌లో అడుగుపెట్టారు విక్రమ్ సుకుమారన్. మొదటి చిత్రమే గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు. విభిన్నమైన కథా, కథనంతో ఈ మూవీని రూపొందించి దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. విశేష ప్రశంసలందుకున్నారు.   

`మధ యెన్నై కూట్టమ్‌` చిత్రం విజయం తర్వాత ఆయన రెండవ చిత్రం `రావణ కోట్టం` 2023లో విడుదలైంది. ఆ మూవీలో శాంతను హీరోగా నటించారు. 

ఇది భూమికి సంబంధించిన కథ కావడంతో, వర్షాకాలంలో మాత్రమే చిత్రీకరించారు విక్రమ్ సుకుమారన్. సంవత్సరంలో కేవలం 3 నెలలు మాత్రమే చిత్రీకరణ జరిపారు. ఈ మూవీకి కూడా మంచి ఆదరణ దక్కింది.

మూడో సినిమాకి దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతుండగా విషాదం 

తన కథకు ప్రాణం పోయడానికి అవిశ్రాంతంగా శ్రమించే సుకుమారన్‌ తన మూడవ చిత్రం ‘తేరుమ్ పోరుమ్’కి  దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతుండగా గుండెపోటుతో మరణించడం అత్యంత బాధాకరం. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు.

విక్రమ్ సుకుమారన్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు. అంతేకాకుండా ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమ దుఃఖంలో మునిగిపోయింది. ఆయన మరణానికి ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!