మోహన్‌లాల్‌ `తుడరుమ్‌` సంచలనం.. మలయాళంలో అన్ని రికార్డులు బ్రేక్‌

Google News Follow Us

సారాంశం

మోహన్‌ లాల్‌ మలయాళ చిత్ర పరిశ్రమని రూల్‌ చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ అన్ని కేరళా రికార్డులను బద్దలు కొట్టింది. అదే సమయంలో సరికొత్త సంచలనంగా నిలిచింది. 

మోహన్ లాల్ ని ఎలా అయితే అభిమానులను చూడాలనుకుంటారో, కరెక్ట్ గా అలానే వచ్చిన మూవీ `తుడరుమ్‌`. ఈ మూవీ ప్రారంభం నుంచే అందరి దృష్టిని ఆకర్షించించింది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెలలో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. ఇటీవలి కాలంలో ఏ సినిమాకూ దక్కని మౌత్ పబ్లిసిటీతో దూసుకుపోయింది. ఇప్పుడు కేరళ బాక్సాఫీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. రెండేళ్లుగా ఎవరూ అధిగమించలేని `2018` సినిమా రికార్డును బద్దలు కొట్టి కేరళలో `తుడరుమ్‌` భారీ విజయం సాధించింది.

మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా `తుడరుమ్‌`..

ఈ సందర్భంగా కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల జాబితా వెలువడింది. సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ నివేదిక ప్రకారం, ఈ జాబితాలో ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. అందులో రెండు ప్రభాస్ సినిమాలు కావడం విశేషం. 89 కోట్లకు పైగా వసూళ్లతో `తుడరుమ్‌` మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో 2018 సినిమా ఉంది. దాని కేరళ వసూళ్లు 89.2 కోట్లు.

టాప్‌ 5లో మూడు మోహన్‌ లాల్‌ చిత్రాలు 

86.3 కోట్లతో `ఎంపురాన్` మూడో స్థానంలో ఉంది. దాని తర్వాత 85 కోట్లతో `పులిమురుగన్` ఉంది. ఐదో స్థానంలో `ఆడుజీవితం` ఉంది. ఈ చిత్రం 79.3 కోట్లు వసూలు చేసింది. మొదటి ఐదు స్థానాల్లో మూడు మోహన్ లాల్ సినిమాలు ఉండటం గమనార్హం. ఆరో స్థానంలో ఫహద్ ఫాజిల్ చిత్రం ఆవేశం ఉంది. ఈ సినిమా కేరళ వసూళ్లు 76.10 కోట్లు అని సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ నివేదించింది.

`బాహుబలి` (74.5 కోట్లు), `మంజుమ్మల్ బాయ్స్` (72.10), `ఏఆర్‌ఎం` (68.75 కోట్లు), `కేజీఎఫ్ చాప్టర్ 2` (68.5) 7 నుంచి 10 వరకు ఉన్నాయి.  మోహన్ లాల్ చిత్రం `తుడరుమ్‌` వ్యాపారం సహా 325 కోట్లు వసూలు చేసింది. ఏదేమైనా, మలయాళ సినిమాలో `తుడరుం` రికార్డును ఎవరు బద్దలు కొడతారో చూడాలి.

 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on