నందమూరి హీరోలపై టాప్ రైటర్ కామెంట్స్!

Published : Dec 19, 2018, 03:25 PM IST
నందమూరి హీరోలపై టాప్ రైటర్ కామెంట్స్!

సారాంశం

ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న జరిగిన 'అంతరిక్షం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న జరిగిన 'అంతరిక్షం' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా మెగా, నందమూరి హీరోల మధ్య చిన్నపాటి యుద్ధ వాతావరణం నెలకొంది.

'అంతరిక్షం' సినిమాను పొగిడే క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ''కాలం మారుతున్న కొద్దీ కథ, కథనాలు కూడా మారతాయని ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. తెలుగు సినిమాల తాలూకు గమనాన్ని 'ఘాజీ', 'అంతరిక్షం' వంటి చిత్రాలతో కొత్త ట్రెండ్ లోకి తీసుకువెళ్తున్నాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి.

అవే పాటలు, అవే కథలు, అవే ఫైట్లతో దర్శకులు తీస్తోన్న సినిమాలతో ప్రేక్షకులు విసిగిపోయారు. కాలు గట్టిగా నేలకేసి కొడితే భూకంపాలు రావడం, విజిల్స్ వేస్తుంటే రైళ్లు రావడం ఇలాంటి విచిత్రాలు కాకుండా ఇంకేమైనా విచిత్రాలు చూడాలనుకుంటున్నారు''అని అన్నారు.

భూకంపాలు, రైళ్లు అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది నందమూరి బాలయ్యే.. ఆయన సినిమాల్లోనే ఇలాంటి విచిత్రాలు చూశారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు నందమూరి అభిమానులను టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టారు.

నందమూరి అభిమానులు కూడా వారి ట్రోలింగ్ కి తమదైన రీతిలో సమాధానాలు చెబుతున్నారు. మెగా హీరోలు కూడా అలాంటి సన్నివేశాల్లో నటించారంటూ గుర్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య