ముగ్గురిలో పవన్‌ ఎవరికి ఓకే చెబుతాడో?

Published : Aug 17, 2020, 01:00 PM IST
ముగ్గురిలో పవన్‌ ఎవరికి ఓకే చెబుతాడో?

సారాంశం

ఈ మూడు సినిమాలతోపాటు తన 29వ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ కమిట్‌ అయ్యాడని తెలుస్తుంది. తన స్నేహితుడు రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమాల జోరు కొనసాగుతూనే ఉంది. ఆయన ఎలక్షన్ల తర్వాత రీఎంట్రీ ఇస్తూ మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో తన 26వ చిత్రం `వకీల్‌సాబ్‌` చిత్రీకరణ జరుపుకుంటోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. దీంతోపాటు 27వ సినిమాగా క్రిష్‌ డైరెక్షన్‌లో చేయనున్నారు. మరోవైపు 28వ సినిమాని `గబ్బర్‌ సింగ్‌` వంటి విజయాన్ని అందించిన హరీష్‌శంకర్‌తో చేయబోతున్నాడు పవన్‌. 

ఈ మూడు సినిమాలతోపాటు తన 29వ సినిమాకి పవన్‌ కళ్యాణ్‌ కమిట్‌ అయ్యాడని తెలుస్తుంది. తన స్నేహితుడు రామ్‌ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే దీనికి దర్శకుడెవరనేది సస్పెన్స్ నెలకొంది. మొన్నటి వరకు `సైరా` ఫేమ్‌ సురేందర్‌రెడ్డి అన్నారు. ఆయన ఒక్కడే కాదు, మరో ఇద్దరి దర్శకుల పేర్లని కూడా పవన్‌ పరిశీలిస్తున్నారట. `గోపాల గోపాల`, `కాటమరాయుడు` చిత్రాలను రూపొందించిన డాలి, అలాగే గోపీచంద్‌ మలినేని కూడా పవన్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్టు సమాచారం. 

వీరంతా ఇప్పటికే పవన్‌కి స్క్రిప్ట్ వినిపించారని, ఈ ముగ్గురిలో ఒకరికి పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే ఛాన్స్ ఉందని, అంతేకాదు దీన్ని తన బర్త్ డే సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్‌ టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. బట్‌ బర్త్ డేకి మాత్రం కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్‌ రాబోతుందనేది ఫిక్స్ అని, ఇదే విషయాన్ని పవన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయిస్తున్నారు. పవన్‌ బర్త్ డే సెప్టెంబర్‌ 2 అనే విషయం తెలిసిందే. 

మరోవైపు ఇటీవల విడుదల చేసిన పవన్‌ బర్త్ డే కామన్‌ డీపీ(సీడీపీ)కి విశేష స్పందన వచ్చింది. దీంతోపాటు బర్త్ డే యాష్‌ ట్యాగ్‌కి ట్విట్టర్‌లో 24గంటల్లో 65.1మిలియన్‌ ట్వీట్లతో ప్రపంచ రికార్డ్ ని సృష్టించారు పవన్‌ అభిమానులు. మహేష్‌ పేరిట ఉన్న 62.1 మిలియన్‌ ట్వీట్ల రికార్డుని బ్రేక్‌ చేసి ప్రపంచ రికార్డ్ ని సృష్టించారు. దీంతో ఇప్పుడు పవన్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నారని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?