
ఈ ఉత్సాహంలో విభిన్న రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాని విభిన్న తరహా ప్రేక్షకులకు వెయ్యి మందికి పైగా చూపెట్టారని సమాచారం. సినిమాకు సంభందం లేని కొంతమందిని ఎంపిక చేసుకుని సినిమా చూపెట్టి అభిప్రాయం తీసుకుంటారు. ఆ విధంగా సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేయబోతున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.! ఈ నేఫద్యంలో ఈ సినిమాని ఆగస్ట్ 14 రాత్రి మీడియాకు చూపించబోతున్నారు.
ఇందులో అడివి శేషు ‘విక్రమ్’ అనే తమిళ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. ఈ సినిమా స్పానిష్ సినిమా రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. 2007లో రిలీజ్ అయిన ది ఇన్విజిబుల్ గెస్ట్ కు ఎవరుగా మార్చారంటున్నారు. ఇదే సినిమాను బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, తాప్సీల కాంబినేషన్‌లో బద్లా పేరుతో రీమేక్ చేశారు.
అయితే స్పానిష్ లో ఓ మహిళ హత్య విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్‌ను అరెస్ట్ చేస్తే, ఇండియన్ రీమేక్‌లలో మాత్రం ఓ వ్యక్తి హత్య విషయంలో ఆమె గర్ల్‌ఫ్రెండ్‌ను అరెస్ట్ చేసినట్టుగా మార్చారు. అయితే ‘ఎవరు’ సినిమా రీమేకా.. కాదా అన్న విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.‘ఎవరు’ సినిమాకు వెంకట్ రాంజీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది.