ఈవారం థియేటర్లలో, ఓటీటీల్లో చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. రేపు, ఎల్లుండి ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ సినిమాలేంటీ? ఏ ఓటీటీలో ఏఏ చిత్రాలు రానున్నాయి.. థియేటర్లలో వచ్చే సినిమాలేంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన Spy మూవీ రేపు గ్రాండ్ గా విడుదల కాబోతోంది. డెబ్యూ డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా చిత్రంగా 'స్పై' థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ వారం తెలుగు నుంచి పెద్ద సినిమాగా రిలీజ్ కాబోతోంది. ఐశ్వర్య మేనన్ కథానాయిక. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా సినిమా రూపొందింది.
అదేవిధంగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా రెబా మోనికా జాన్ హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం'సామజవరగమన'. రామ్ అబ్బరాజు దర్శకుడు. రాజేష్ దండా నిర్మాత. గోపీ సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం రేపు (జూన్ 29)న ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే చిత్రంపై మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది.
యాక్షన్ అడ్వెంచర్ సినిమా 'ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ'. ఈ చిత్రం కూడా ఇంగ్లీష్ తో పాటు ఇండియన్ రీజినల్ భాషల్లోనూ థియేటర్లలో సందడి చేయబోతోంది.
భిన్నమైన మనస్థత్వాలు కలిసిన ప్రేమికుల మధ్య సాగే లవ్ అండ్ రొమాంటిక్ మూవీ 'లవ్ యూ రామ్' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. రోహిత్ బెహల్ హీరోగా అపర్ణ జనార్ధనన్ హీరోయిన్ గా నటించారు. అయితే ఈ చిత్రం మాత్రం జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున పాయల్ రాజ్ పుత్, సునీల్ శ్రీనివాసరెడ్డి విరాజ్ నటించిన ‘మాయాపేటిక’ కూడా రిలీజ్ కాబోతోంది.
ఇక రేపు రిలీజ్ కాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ‘నారాయణ అండ్ కో’ చిత్రం కూడా ఉంది. రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. వచ్చే రెండు రోజుల్లో మొత్తం ఆరు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
ఇక ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ ల విషయానికొస్తే..
డిస్నీప్లస్ హాట్ స్టార్ లో : వీకెండ్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్) – జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ మరుసటి రోజు జూన్ 30న ‘ది నైట్ మేనేజర్ 2’ స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో : జాక్ ర్యాన్ 4 (జూన్ 30),
వీరన్ (జూన్ 30)
నెట్ ఫ్లిక్స్ లో : తమన్నా భాటియా, విజయ్ వర్మ తో పాటు బాలీవుడ్ స్టార్ కాస్ట్ నటించిన Lust Stories 2 రేపు (జూన్ 29)న అందుబాటులోకి రానుంది. ‘సీయూ ఇన్ మై నైన్టీన్త్ లైఫ్’ అనే కొరియన్ సిరీస్ కూడా రేపు ఈ ఓటీటీలోకి రానుంది. ఇదే ఓటీటీలో జూన్ 30న ‘అఫ్వా’ అనే హిందీ మూవీతో పాటు ‘సెలబ్రిటీ’ అనే కొరియన్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉన్నాయి.
Ahaలో : ‘అర్థమైందా అరుణ్ కుమార్’ అనే సిరీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మడివాడ ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ జూన్ 30న ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.
జీ5లో : ‘లకడ్ బగ్గా’ మూవీ జూన్ 30న స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది.
జియో సినిమాలో : సార్జెంట్ అనే హిందీ సిరీస్ జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షోలో : ఫాస్ట్ ఎక్స్ అనే హాలీవుడ్ చిత్రం రిలీజ్ కానుంది. ఇది జూన్ 29 (రేపే) ప్రేక్షకుల ముందుకు రానుంది.