
శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ `ఇండియన్ 2` చిత్రంలో నటిస్తున్నారు. 25ఏళ్ల క్రితం వచ్చిన `ఇండియన్`(భారతీయుడు) సినిమాకిది సీక్వెల్. సరికొత్త కథతో దర్శకుడు శంకర్ ఈ సినిమాని రూపందిస్తున్నారు. `భారతీయుడు` సినిమా ఇండియన్ సినిమాలోనే ఓ సంచలనం. అవినీతి, లంచగొండితనంపై వచ్చిన సినిమా ఇది. రికార్డులు బ్రేక్ చేసింది. దీనికి సీక్వెల్ కావడంతో `ఇండియన్ 2`పై భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమా అనేక అడ్డంకులను ఎదుర్కొని, ఆగిపోయింది. ఇక క్యాన్సిల్ అనే స్టేజ్ నుంచి మళ్లీ ఊపందుకుంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం శంకర్ ఓ వైపు రామ్‌చరణ్‌తో `గేమ్ ఛేంజర్`ని తెరకెక్కిస్తూనే కమల్ హాసన్‌తో `ఇండియన్ 2`చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కమల్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఫ్యాన్స్ అందరికి ఫుల్ ఖుషీ చేసే వార్త చెప్పారు. చిత్ర దర్శకుడు శంకర్‌ని అభినందించారు. ఈ సినిమాతో ఆయన కెరీర్ పీక్‌లోకి వెళ్తుందని పరోక్షంగా చెప్పారు. అయితే దీన్ని పీక్‌గా భావించవద్దని, ఇంకా మున్ముందు అనేక అత్యున్నత శిఖరాలను చేరుకోవాలన్నారు.
ట్విట్టర్ ద్వారా శంకర్‌ని అభినందిస్తూ, `ఇండియన్2`కి సంబంధించిన మెయిన్ సీన్లు చూశాను. దర్శకుడు శంకర్‌కి నా అభినందనలు. నా సలహా ఏంటంటే ఇది మీ శిఖరం కాకూడదని, ఎందుకంటే ఇది మీ కళాత్మక జీవితంలో అత్యున్నత దశ. దీన్ని పైకి తీసుకెళ్లి గర్వపడకండి, ఎన్నో కొత్త ఎత్తుల అన్వేషణలో ఉండండి` అని పేర్కొన్నారు కమల్ హాసన్. పరోక్షంగా ఈ సినిమా శంకర్ కెరీర్‌లోనే పీక్‌కి తీసుకెళ్లే చిత్రమవుతుందని, సంచలన మూవీ కాబోతుందనే హింట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్‌కి ఓ కాస్ట్లీ వాచ్‌ని గిఫ్ట్ గా ఇచ్చాడు కమల్. ఆ ఫోటోని పంచుకోగా అది వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో కమల్ హాసన్‌తోపాటు సిద్ధార్థ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. లైకా దీన్ని నిర్మిస్తుంది. ఇక కమల్ హాసన్ చివరగా `విక్రమ్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుంది. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ చిత్రమది. రూ.350కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. దీంతో రెట్టింపు ఎనర్జీ వచ్చింది. దీంతో ఆగిపోయిన `ఇండియన్ 2` కి సంబంధించిన దర్శకుడు, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించి సినిమాని తిరిగి స్టార్ట్ చేయించారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంది.