
దొంగాట - (మే 6 )
ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) నటించిన తొందిముతలమ్ దృక్షక్షియుం అనే మూవీని దొంగాట (Dongata) పేరుతో ఆహా ఈ శుక్రవారం నాడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా అందరి ముందుకి తీసుకురాబోతుంది. ఉత్తమ మలయాళ చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న ఈ చిత్రం కథ విషయానికి వస్తే, సూరజ్ వెంజ్రమోడు, నిమిషా సజయన్ అనే నూతన వధూవరుల చుట్టూ తిరుగుతుంది. వారి కుటుంబం ఆ ఇద్దరి కులాంతర వివాహాన్ని ఒప్పుకోకపోవడంతో వేరే ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అక్కడ వారికి ఒక దొంగ (ఫహడ్ ఫాజిల్) కనబడుతాడు. శ్రీజ వేసుకున్న గొలుసుని తాను దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మే 6 నాడు ఆహాలో చూడాల్సిందే. అంతే కాకుండా, పుష్ప - ది రైజ్ తర్వాత తెలుగు లో వస్తున్న ఫహద్ రెండో సినిమా ఇది.
తెలుగు ఇండియన్ ఐడల్ (మే 6 మరియు 7 )
సంగీత సుస్వరాలలో ప్రతి వారం అందరినీ అలరిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol) ఈ వారం కూడా తన ప్రియమైన అభిమానులని ఉర్రూతలూగించడానికి వచ్చేస్తుంది. తెలుగు సినిమా పాటల ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సంగీత మాంత్రికుడు మణిశర్మ(Manisharma). ఆ సంగీత ధ్రువ తార ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ ఫ్యామిలీ ఎపిసోడ్ లో ప్రత్యేక అతిధిగా విచ్చేయనున్నారు. ఈ షో కి యాంకర్ గా శ్రీ రామచంద్ర, నిత్యా మీనన్, కార్తీక్ మరియు తమన్ న్యాయనిర్ణేతలుగా నిర్వహిస్తున్నారు. ఎన్నో ఆశ్చర్యాలు చూడాలనుకుంటే ఈ శుక్రవారం, శనివారం తప్పకుండా ఆహా ను స్ట్రీమ్ చేయండి .
సర్కార్ 2
రెండింతల వినోదాన్ని అభిమానులకి ఇవ్వడంలో "ఆహా" (AHA)తనకు తానే సాటి. సర్కార్ రెండో సీజన్ తో ఇప్పటికే అందరినీ ఆహ్లదపరుస్తుంది మన ఆహా. ఈవారం కూడా తగ్గేదెలే అంటూ సింగర్స్ స్పెషల్ ఎపిసోడ్ తో వస్తుంది సర్కార్ 2 (Sarkar) . హేమ చంద్ర, మధు ప్రియ, మోహన భోగరాజు మరియు సాకేత్ కొముందరి ఈ వారం ఈ గేమ్ షో లో పాల్గొంటున్నారు. ఈ నలుగురి లో ఎవరు సర్కార్ తో కలిసి ఆడుతారు? ఎవరు విజేతగా నిలుస్తారు? తెలుసుకోవాలంటే ఈ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తప్పకుండా ఆహా ను స్ట్రీమ్ చేయండి.ఇంకా ఎందుకు ఆలస్యం? ఈ శుక్రవారం మరియు శనివారం మీ ఆహా ను తప్పక వీక్షించండి.