Jayamma Panchayathi: కాళ్లు ఇరక్కొడతాను..గొల్లిగా ...సుమ చేత ఇదీ అనిపించారే

Surya Prakash   | Asianet News
Published : May 04, 2022, 02:35 PM IST
Jayamma Panchayathi: కాళ్లు ఇరక్కొడతాను..గొల్లిగా ...సుమ చేత ఇదీ అనిపించారే

సారాంశం

 అదే సమయంలో గ్రామంలోని ఓ యువకుడు తన కూతురితో సరసాలాడడానికి ప్రయత్నిస్తాడు. అతని నుంచి కూతురిని కాపాడుకుందా? జయమ్మ పెట్టిన పంచాయితీ ఏంటి? దాని వల్ల గ్రామ పెద్దలకు ఎదురైన సమస్యలు ఏంటి? తెలియాలంటే మే 6న థియేటర్స్‌లో ‘జయమ్మ పంచాయితీ’ చూడాల్సిందే. 


‘గుండాలు తొక్కిన గండం గట్టేకినట్టే ఉంది’.‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ వంటి డైలుగులోత జయమ్మ వచ్చేసింది. యాంకర్‌ సుమ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయితీ. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా జయమ్మ పంచాయితీ ట్రైలర్‌ని విడుదల చేశారు. కామెడీ డ్రామాతో పాటు ఎమోషన్స్  ఉండేలా ట్రైలర్‌ని కట్‌ చేశారు మేకర్స్‌.  ఈ ట్రైలర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ట్రైలర్ ని మీరు ఓ లుక్కేయండి.

 పిల్ల ఫంక్షన్‌ చేసి వచ్చిన డబ్బులతో భర్తకు ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంటుంది జయమ్మ. అది జరగదు.దీంతో తీవ్ర నిరాశకు లోనవుతుంది. ఎలాగైన భర్తకు ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంటుంది. అదే సమయంలో గ్రామంలోని ఓ యువకుడు తన కూతురితో సరసాలాడడానికి ప్రయత్నిస్తాడు. అతని నుంచి కూతురిని కాపాడుకుందా? జయమ్మ పెట్టిన పంచాయితీ ఏంటి? దాని వల్ల గ్రామ పెద్దలకు ఎదురైన సమస్యలు ఏంటి? తెలియాలంటే మే 6న థియేటర్స్‌లో ‘జయమ్మ పంచాయితీ’ చూడాల్సిందే. 
 
 ‘నా ఎనబైయేళ్ల జీవితంతో ఇలాంటి గొడవ వినలేదు, చూడలేదు’అని ఓ పెద్దాయన అనడం.. ‘తెల్లారికల్లా నా విషయం తేల్చలేదంటే.. ఊళ్లో ఎవరెవరైతే పెద్ద మనుషులని తిరుగుతున్నారో ఆలింటిముందే ఆళ్లకు పిండం పెట్టకపోతే సూడండి’అంటూ జయమ్మ వార్నింగ్‌ ఇవ్వడం సినిమాపై ఇంట్రస్ట్  పెంచుతుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమ తన సహజ నటనతో దుమ్ము రేపిందని ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. దినేష్‌ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా  నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అదించారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?