హీరోయిన్ కాకముందు కీర్తి సురేష్ జాబ్ ఏంటో తెలుసా? ఆమె మొదటి సంపాదన ఎంత అంటే?

By Sambi Reddy  |  First Published Aug 25, 2024, 4:42 PM IST

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వ్యక్తిగత విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమె హీరోయిన్ కాకముందు ఒక జాబ్ చేసిందట. అందుకు తాను తీసుకున్న శాలరీ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు... 
 


కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఆమెకు మార్కెట్ ఉంది. ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. వరుణ్ ధావన్ కి జంటగా ఆమె బేబీ జాన్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. ఇది తమిళ్ హిట్ మూవీ తేరీ రీమేక్. బేబీ జాన్ డిసెంబర్ నెలలో విడుదల కానుందని సమాచారం. ఇటీవల కీర్తి సురేష్ రఘు తాత టైటిల్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. 

ప్రస్తుతం కీర్తి సురేష్ బేబీ జాన్ తో పాటు రెండు తమిళ చిత్రాలు చేస్తుంది. రివాల్వర్ రీటా, కన్నివేడి టైటిల్స్ తో ఈ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.  కాగా కీర్తి సురేష్ బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. కీర్తి సురేష్ తల్లి మేనక 80-90లలో స్టార్ హీరోయిన్. మలయాళ, తమిళ చిత్రాల్లో మేనక ఎక్కువగా నటించింది. సురేష్ సైతం పరిశ్రమకు చెందినవాడే. 

Latest Videos

కొన్ని చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కీర్తి సురేష్... హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఓ జాబ్ చేసిందట. ఫ్యాషన్ షోలలో బట్టలు సర్దే జాబ్ చేసిందట. అందుకు గాను ఆమెకు రూ. 500 ఇచ్చారట. అదే తన తొలి సంపాదన అని కీర్తి సురేష్ ఓ సందర్భంలో వెల్లడించింది. కీర్తి సురేష్ కెరీర్లో మహానటి మైలురాయి వంటి చిత్రం. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి బ్లాక్ బస్టర్ అందుకుంది. 

కీర్తి సురేష్ కెరీర్ కి గట్టి పునాది వేసిన చిత్రం మహానటి. ఈ చిత్రంలో నటనకు కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకుంది. మహానటి చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. ఆయన తెరకెక్కించిన కల్కి 2898 AD  చిత్రంలో కీర్తి సురేష్ బుజ్జి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. నిజానికి నాగ్ అశ్విన్ ఓ పాత్ర కోసం కీర్తి సురేష్ ని అడిగాడట. కీర్తి సురేష్ చేయను అన్నారట. మళ్ళీ ఫోన్ చేసే కల్కిలో నటించాలని ఉందని నాగ్ అశ్విన్ ని కోరితే.. బుజ్జి పాత్రకు వాయిస్ ఓవర్ అడిగాడట. 
 

click me!