
ఒక ప్రక్క రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుగుతుండగా... మరో ప్రక్క దర్శకుడు బుచ్చిబాబు సాన ఆర్సీ-16 ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బి బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన 16వ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. అలాగే ఉత్తరాంధ్ర నేటివిటీకి సంబంధించిన సినిమా. అందుకే ఆ ఏరియాల్లో ఆడిషన్స్ నిర్వహించి కొందరు నటులను ఎంపిక చేశారు. రంగస్థలం అనంతరం రామ్ చరణ్ ఆ తరహా చిత్రం చేస్తున్నారు.
కాగా ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ టైటిల్ ఎన్టీఆర్ అప్ కమింగ్ చిత్రానికి అంటూ గతంలో వినిపించింది. కారణం... బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్ మొదట ఎన్టీఆర్ కి వినిపించాడు. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఓకె అన్నారు. దీంతో పెద్ది టైటిల్ కూడా లీకైంది.
ఎన్టీఆర్ ఎందుకో ఈ స్క్రిప్ట్ కి రామ్ చరణ్ ని సూచించారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కి స్క్రిప్ట్ నేరేట్ చేసి ఒప్పించారు. ఎన్టీఆర్ కి అనుకున్న టైటిలే రామ్ చరణ్ కి ఫిక్స్ చేశారట. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక రామ్ చరణ్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం జాన్వీ దేవర మూవీలో ఎన్టీఆర్ తో జతకడుతున్న విషయం తెలిసిందే.
ఆర్సీ 16లో కృతి సనన్ సైతం నటిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దాదాపు ప్రీ ప్రొడక్షన్ పూర్తి అయ్యింది. త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. బుచ్చిబాబుకు దర్శకుడిగా ఇది కేవలం రెండో చిత్రం. రామ్ చరణ్ వంటి స్టార్ ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి...