పవన్ కళ్యాణ్ బాటలో బాలకృష్ణ... ఆ దిశగా కీలక నిర్ణయం!

Published : Mar 15, 2024, 01:23 PM IST
పవన్ కళ్యాణ్ బాటలో బాలకృష్ణ... ఆ దిశగా కీలక నిర్ణయం!

సారాంశం

బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా పవన్ కళ్యాణ్ బాటలో నడవాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.   

బాలకృష్ణ కెరీర్ సక్సెస్ ట్రాక్ లో పరుగెడుతోంది. ఎన్నడూ లేని విధంగా ఆయన హ్యాట్రిక్ విజయాలు సాధించాడు. అఖండ ముందు వరకు బాలయ్య పరిస్థితి దారుణంగా ఉంది. యంగ్ హీరోలతో కూడా పోటీపడలేక ఆయన సినిమాలు చతికలపడ్డాయి. ఎన్టీఆర్ బయోపిక్స్, రూలర్ చిత్రాలు కనీస వసూళ్లు రాబట్టడంలో ఫెయిల్ అయ్యాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు థియేటర్స్ ముందు ఉచిత ప్రదర్శన బోర్డులు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన రూలర్ కూడా డిజాస్టర్ అయ్యింది. 

కలిసొచ్చిన దర్శకుడు బాలయ్యకు ఊపిరి పోశాడు. బోయపాటి శ్రీను అఖండ సినిమాతో పూర్వవైభవం తెచ్చాడు. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన అఖండ కాసులు కురిపించింది. అనంతరం వీరసింహారెడ్డితో మరో విజయం అందుకున్నాడు. వీర సింహారెడ్డి భారీ హిట్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ అందుకుంది. ఇక భగవంత్ కేసరి మూవీతో హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేశాడు. 

భగవంత్ కేసరి సెట్స్ పై ఉండగానే బాలకృష్ణ 109వ చిత్రం ప్రకటించాడు. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ ఈ చిత్ర దర్శకుడు. NBK 109 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. శివరాత్రి కానుకగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ మోత పుట్టించింది. బాలయ్య లుక్, డైలాగ్, విజువల్స్ అలరించాయి. థమన్ బీజీమ్ వేరే లెవల్ అని చెప్పాలి. ఫస్ట్ గ్లింప్స్ విపరీతంగా అంచనాలు పెంచేసింది. 

NBK 109 కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తుండగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మాదిరి బాలయ్య కూడా ఎన్నికల కోసం ఈ చిత్ర షూటింగ్ పక్కన పెట్టేస్తున్నాడట. ఎన్నికలు అయ్యేవరకు NBK 109 షూటింగ్ లో బాలయ్య పాల్గొనడం జరగదు అంటున్నారు. ఎన్నికలకు రోజుల సమయం మాత్రమే ఉంది. బాలయ్య టీడీపీ తరపున హిందూపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తున్నాడు. దీంతో హిందూపురంలో ఎన్నికల ప్రచారం షురూ చేయాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలో NBK 109 షూటింగ్ కి బాలయ్య షార్ట్ బ్రేక్ ఇస్తున్నారట. బాలయ్య నిర్ణయం నేపథ్యంలో ఆయన పవన్ బాటలో నడుస్తున్నాడని సోషల్ మీడియా జనాలు అభిప్రాయం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కొన్ని నెలల మునుపే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర  వీరమల్లు చిత్రాల షూటింగ్ పక్కన పెట్టి రాజకీయ కార్యక్రమాల్లో మునిగిపోయాడు. కాగా పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే... 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?