పవన్ కళ్యాణ్ 'ఖుషి' వల్ల ఇరకాటంలో పడ్డ హీరోయిన్.. ఏం జరిగిందంటే..

By tirumala AN  |  First Published Aug 27, 2024, 9:21 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. 


నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఒక రకంగా ప్రియాంకకి ఇది జాక్  పాట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రియాంకకి ఇటీవల సరైన ఆఫర్స్ లేవు. 

సరిపోదా శనివారం మాత్రమే కాదు.. ఇదే డివివి దానయ్య నిర్మాణంలోనే ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ ఓజి చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. అంటే ప్రియాంకకి డబుల్ ధమాకా అన్నమాట. అయితే ప్రియాంక మోహన్ చిన్నపాటి వివాదంలో చిక్కుకుంది. 

Latest Videos

ఇటీవల సరిపోదా శనివారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియాంక మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎస్ జె సూర్య గురించి మాట్లాడుతూ.. నేను సూర్య సర్ తో తమిళ్ లో డాన్ చిత్రంలో నటించాను. ఇప్పుడు సరిపోదా శనివారంలో నటిస్తున్నాను. అయితే ఫ్యాన్స్ అందరి తరుపున నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు మళ్ళీ ఎప్పుడు దర్శకత్వం చేస్తారు ? చేస్తే ఖుషి 2 చేయండి.. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారితో మాత్రమే చేయండి. 

ఎందుకంటే ఖుషి 2 చితం ఒక క్లాసిక్ అంటూ అభివర్ణించింది. ప్రియాంక కామెంట్స్ ని తమిళ ఆడియన్స్, ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ తప్పు పడుతున్నారు. ఖుషి చిత్రాన్ని తమిళ్ నుంచి రీమేక్ చేశారు. ఖుషి 2 చేస్తే విజయ్ తో చేయాలి కానీ పవన్ కళ్యాణ్ తో చేయమని చెప్పడం ఏంటి అంటూ విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. చిన్న మాట వల్ల ప్రియాంక వివాదంలో చిక్కుకుంది. దీనితో పవన్, విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలయింది. తమిళ ఖుషి, తెలుగు ఖుషిని పోల్చుతూ కామెంట్స్ చేసుకుంటున్నారు. 

click me!