వార్ 2కి మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫమ్? ఆయన ఎవరో తెలుసా?

Published : Mar 23, 2024, 10:52 PM IST
వార్ 2కి మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫమ్? ఆయన ఎవరో తెలుసా?

సారాంశం

హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ కాంబోలో భారీ యాక్షన్ ఫిల్మ్ ‘వార్’ (War 2) రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. కాగా చిత్రం గురించి క్రేజీ అప్డేట్ అందింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) - బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) మల్టీస్టారర్ గా బిగ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జపాన్ లో ప్రారంభమై శరవేగంగా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతాయా అని అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రమంలో వార్ 2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది. అది మరేంటో కాదు.. ఈ బిగ్ ప్రాజెక్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే దానిపై ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు టీమ్ ఎవరినీ అనౌన్స్ చేయలేదు. కానీ ప్రముఖ కంపోజర్ ప్రీతమ్ (Pritham) ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కు సంగీతం అందించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అప్డేట్ కూడా రానుందంటున్నారు. 
 
ఇక వార్ 2లో హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సీక్వెల్ లో హృతిక్, ఎన్టీఆర్ పాత్రలపై ఆసక్తి నెలకొంది. హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ బిగ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఎంట్రీ ఉంటుందంట. జపానీస్ స్వోర్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో హృతిక్ రోషన్ ఆకట్టుకోబోతున్నారని ఇప్పటి వరకు అప్డేట్స్ అందాయి. ఈ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం