దేశం మొత్తం లోక్ సభ ఎన్నికల వేడి కనిపిస్తోంది. చాలా మంది సినీతారలు, క్రీడాకారులు లోక్ సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. తాజాగా మరో క్రేజీ హీరోయిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
దేశం మొత్తం లోక్ సభ ఎన్నికల వేడి కనిపిస్తోంది. చాలా మంది సినీతారలు, క్రీడాకారులు లోక్ సభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. తాజాగా మరో క్రేజీ హీరోయిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఆమె ఎంపీ అభ్యర్థిగా పోటీ కూడా చేస్తుంది. ఆమె ఎవరో కాదు.. చిరుత చిత్రంలో రాంచరణ్ సరసన నటించిన నేహా శర్మ.
ఆమె స్వస్థలం బీహార్ లోని భాగల్పూర్. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో నేహా శర్మ తండ్రి అజిత్ శ్రమ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో పోటీ చేయబోతోంది. అజిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె నేహా శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భాగల్పూర్ మాకు మంచి పట్టున్న నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీకే కూటమిలో ఇక్కడ సీటు రావాలని కోరుకుంటున్నాం. పొత్తులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సీటు వస్తే నా కుమార్తెని ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపాలని ప్రయత్నిస్తున్నా. లేకుంటే నేనే పోటీ చేస్తా. ఏమైనా జరగొచ్చు అని అజిత్ శర్మ అన్నారు. తన కుమార్తెని రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు హైకమాండ్ తో చర్చలు జరుపుతున్నట్లు అజిత్ శర్మ అన్నారు.
ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి వస్తే నేను, నా కుమార్తె ఇద్దరిలో ఎవరు పోటీ చేయాలనేది హై కమాండ్ నిర్ణయిస్తుంది అని అజిత్ అన్నారు. నేహా శర్మ ప్రస్తుతం సినిమాల్లో అంతగా యాక్టివ్ గా లేదు. ఆఫర్స్ ఎక్కువగా రావడం లేదు. దీనితో ఆమె రాజకీయాలపై ఆసక్తి చూపుతోందా అనే చర్చ జరుగుతోంది.