'సాహో' మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు హర్ట్ అయ్యారంటే..?

Published : May 28, 2019, 03:41 PM IST
'సాహో' మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు హర్ట్ అయ్యారంటే..?

సారాంశం

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సాహో'. 

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ముందుగా సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ లను మ్యూజిక్ అందించడానికి ఎంపిక చేసుకున్నారు.

అయితే ఇప్పుడు షూటింగ్ దాదాపు పూర్తయిన సమయంలో వారు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని శంకర్ మీడియా ద్వారా వెల్లడించారు. 'సాహో' సినిమాలో బయట కంపోజర్ల నుండి మరిన్ని పాటలు యాడ్ చేయాలని చిత్రబృందం భావిస్తోందని ఈ విషయం తమకు అసౌకర్యాన్ని కలిగించినట్లు చెప్పారు.

సినిమాకు తామే సంగీత దర్శకులుగా ఉండాలని అనుకున్నట్లు, అందుకే సినిమా నుండి తప్పుకున్నట్లు చెప్పారు. ఈ మధ్య ఒక సినిమాకు ఎందరో సంగీత దర్శకుడు కలిసి పని చేస్తున్నారని, ఇదే విషయం నిర్మాణ సంస్థ తమతో చర్చించిందని కానీ అది మాకు ఇష్టం లేదని అన్నారు.

ఈ సినిమాకు సంగీతంతో పాటు నేపధ్య సంగీతం కూడా అందించాలనుకున్నామని, కానీ నిర్మాణ సంస్థ దానికి వేరొకరిని నియమించుకుందని అన్నారు. కనీసం పాటల వరకైనా తీసుకొని ఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే