సెలూన్ లో చిచ్చు రేపిన హీరోయిన్.. ఉద్యోగిపై కత్తితో దాడి!

Siva Kodati |  
Published : May 28, 2019, 03:30 PM ISTUpdated : May 28, 2019, 03:32 PM IST
సెలూన్ లో చిచ్చు రేపిన హీరోయిన్.. ఉద్యోగిపై కత్తితో దాడి!

సారాంశం

బుల్లి తెరపై యువ నటుడిగా రాణిస్తున్న అభిమన్యు చౌదరి ఓ వర్థమాన హీరోయిన్ వల్ల ఇబ్బందుల్లో పడ్డాడు. ముంబైలోని ఓ సెలూన్ లో జరిగిన గొడవలో అభిమన్యు అక్కడి ఉద్యోగులపై కత్తితో దాడికి పాల్పడ్డట్లు కేసు నమోదైంది. 

బుల్లి తెరపై యువ నటుడిగా రాణిస్తున్న అభిమన్యు చౌదరి ఓ వర్థమాన హీరోయిన్ వల్ల ఇబ్బందుల్లో పడ్డాడు. ముంబైలోని ఓ సెలూన్ లో జరిగిన గొడవలో అభిమన్యు అక్కడి ఉద్యోగులపై కత్తితో దాడికి పాల్పడ్డట్లు కేసు నమోదైంది. దీనితో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సదరు వర్థమాన హీరోయిన్ అభిమన్యు చౌదరికి స్నేహితురాలు. ఆమె ఫోన్ చేసి పిలిచిన కారణంగానే అతడు సెలూన్ కు వెళ్ళాడు. 

వారం క్రితం జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులు తాజాగా వివరాలు అందించారు. సదరు వర్తమాన నటి కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఓ ప్రముఖ సెలూన్ కు వెళ్ళింది. ఆమె హెడ్ మసాజ్ చేయించుకుంటున్న సమయంలో అక్కడి ఉద్యోగి ఆమెని అసభ్యకరంగా ప్రైవేట్ భాగాలపై చేతులువేస్తూ ఇబ్బందికి గురిచేశాడట. దీనితో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. తానేమి చేయలేదని కేవలం మసాజ్ మాత్రమే చేస్తున్నానని సాధిక్ అనే ఉద్యోగి వాదించాడు. అతడికి మరో మహిళా ఉద్యోగి కూడా మద్దత్తు తెలిపింది. 

వెంటనే సదరు నటి  అతడి స్నేహితులైన అభిమన్యు చౌదరికి, మరి కొంతమందికి ఫోన్ చేసి జరిగిన సంఘటన వివరించింది. దీనితో అభిమన్యు చౌదరి తన గ్యాంగ్ తో నిమిషాల్లో సెలూన్ వద్దకు చేరిపోయాడు. వెంటనే సెలూన్ ఉద్యోగిపై దాడికి తెగబడ్డాడు. మహిళా ఉద్యోగిపై కత్తితో దాడి చేసినట్లు సిసిటివిలో రికార్డ్ అయింది. దీనితో పోలీసులు అభిమన్యు చౌదరిని, అతడి స్నేహితులని అరెస్ట్ చేశారు. తనతో సెలూన్ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడనే నటి ఫిర్యాదుపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే