కరీనా, షాహిద్ సీరియస్ లవ్ స్టోరీ.. విద్యాబాలన్ ఎంట్రీతో బ్రేకప్!

By team teluguFirst Published May 23, 2021, 3:43 PM IST
Highlights

షాహిద్ తో ఎఫైర్ వద్దని ఫ్యామిలీ ఒత్తిడి కరీనాపై ఉండేది. అయితే కరీనా షాహిద్ కి దూరం కావడానికి అసలైన కారణం మాత్రం విద్యాబాలన్ అట. 

బాలీవుడ్ క్రేజీ ప్రేమ కథల్లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ లవ్ స్టోరీ ఒకటి. ఏళ్ల తరబడి సాగిన వీరి ప్రేమ బంధం అందరికీ తెలిసిన రహస్యమే. ఓపెన్ గా మేము ప్రేమికులమని మీడియాకు తెలియజేశారు ఈ జంట. చెట్టాపట్టాలేసుకొని ముంబై వీధుల్లో విహారాలు చేశారు. మీడియాకు షాహిద్, కరీనా ప్రేమ కథ ఎవర్ గ్రీన్ టాపిక్ లా ఉండేది. షాహిద్, కరీనా పెళ్లి చేసుకోవడం తథ్యం అని అందరూ భావించారు. మెజారిటీ బాలీవుడ్ ప్రేమ కథల మాదిరే వీరు కూడా కొన్నాళ్ల తరువాత విడిపోయారు. 


షాహిద్, కరీనా కలిసి నటించిన మొదటి చిత్రం ఫిదా. అంతకంటే ముందే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. 2003లో వీరి ఎఫైర్ మొదలైంది. స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న కరీనా ప్రేమికుడు షాహిద్ నే తన చిత్రాలలో హీరోగా తీసుకోవాలని పట్టుబట్టేవారట. వీరు కాంబినేషన్ లో వస్తున్న చిత్రాలు ఫెయిల్ అవుతున్నా ఆమె డిమాండ్ రీత్యా దర్శక నిర్మాతలకు తప్పలేదు. షాహిద్, కరీనా కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు ప్లాప్, నాలుగవ చిత్రం జబ్ వి మెట్ మాత్రం సూపర్ హిట్. 


జబ్ వి మెట్ మూవీ షాహిద్, కరీనాల నిజమైన ప్రేమ కథ అని సమాచారం. అయితే ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి బంధం బీటలు వారడం మొదలైంది. షాహిద్ తో ఎఫైర్ వద్దని ఫ్యామిలీ ఒత్తిడి కరీనాపై ఉండేది. అయితే కరీనా షాహిద్ కి దూరం కావడానికి అసలైన కారణం మాత్రం విద్యాబాలన్ అట. విద్యాబాలన్ తో షాహిద్ సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసి కరీనా మనసు విరిగిపోయిందట. ఈ విషయంలో షాహిద్ ని నిలదీయడంతో సరైన సమాధానం చెప్పలేదట. అలా 2003లో మొదలైన ప్రేమ బంధం 2007లో ముగిసింది. 

click me!