ఆ హీరో మీద ఇష్టం బయటపెట్టిన కీర్తి సురేష్..!

Published : Mar 25, 2023, 05:05 PM IST
ఆ హీరో మీద ఇష్టం బయటపెట్టిన కీర్తి సురేష్..!

సారాంశం

దసరా మూవీ ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటుంది కీర్తి సురేష్. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.

దసరా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హిందీ పరిశ్రమలో తనకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పాలని... పాత్రికేయులు అడిగారు. దీనికి సమాధానంగా కీర్తి టక్కున షారుక్ ఖాన్ పేరు చెప్పారు. నేను షారుక్ అభిమానిని. ఆయనంటే చాలా ఇష్టం. షారుక్ తో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను. ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాని చెప్పుకొచ్చారు. చాలా మంది మగువల మాదిరి కీర్తి సురేష్ మనసును కూడా షారుక్ ఖాన్ దోచేశాడని అర్థం అవుతుంది. 

ఇక దసరా చిత్ర విజయం మీద టీం పూర్తి విశ్వాసంతో ఉన్నారు. హీరో నాని, కీర్తి సురేష్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. నాని అయితే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సౌత్ అండ్ నార్త్ ఇండియాలోని అనేక నగరాల్లో ప్రెస్ మీట్స్ లో పాల్గొంటున్నారు. లోకల్ మీడియాతో ముచ్చటిస్తున్నారు. మార్చి 30న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో దసరా విడుదల కానుంది. 

కాగా ఈ చిత్ర కథపై ఆల్రెడీ కొన్ని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. స్నేహం, ప్రేమ, పగ... ఈ మూడు అంశాలు ప్రధానంగా దసరా చిత్రం తెరకెక్కిందట. బీభత్సమైన యాక్షన్ తో పాటు లోతైన భావోద్వేగాలు కూడా ఉంటాయట. కథలో ఊహించని మలుపులు సైతం అలరిస్తాయట. మొత్తంగా దసరా ఫుల్ మీల్ వంటి సినిమా అంటున్నారు. దసరా చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంది. 

నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రాన్ని తెరకెక్కించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. కెరీర్లో మొదటిసారి... డీగ్లామర్ ఊరమాస్ రోల్ చేశాడు నాని. కీర్తి సురేష్-నానిల జంట బాగుంది. పాటలు కూడా ఆకట్టుకుంటుండగా ... సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ఇక కీర్తి తెలుగులో దసరాతో పాటు భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలుగా కీర్తి నటిస్తున్నారు. ఆగస్టు 11న భోళా శంకర్ విడుదల కానుంది. 
 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan కోసం రామ్ చరణ్ త్యాగం? పెద్ది రిలీజ్ పై మెగా అభిమానుల్లో ఆందోళన
Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?