మరో ఐదు రోజుల్లో ప్రేక్షకులకు ముందుకు రానున్న ‘దసరా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా డేట్, ప్లేస్ ఖరారు చేసి మేకర్స్ అనౌన్స్ మెంట్ అందించారు.
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘దసరా’ Dasara. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు నెల ముందు నుంచే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. నానినే ప్రచార కార్యక్రమాలను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. నాని కేరీర్ లోనే తొలిసారిగా పాన్ ఇండియన్ ఫిల్మ్ విడుదల కాబోతుండటంతో వీలైనంత రీచ్ సాధించేందుకు దేశ వ్యాప్తంగా తిరుగుతూ సినిమాను ప్రచారం చేస్తున్నారు నాని. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, పలు రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇక మరో ఐదు రోజుల్లో ‘దసరా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తుండగా.. మరింత హైప్ తెచ్చేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లను మొదలు పెట్టారు. ప్రస్తుతానికి ప్లేస్, డేట్, టైమ్ ఫిక్స్ చేసి అప్డేట్ అందించారు. ఏపీలోని అనంతపూర్ జిల్లాలోని అలుమూరు రోడ్ లోని పీవీకేకే ఇంజనీరింగ్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నారు. మార్చి 26న సాయంత్ర 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోందని ప్రకటించారు. దీంతో నాని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అయితే రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపూర్ లోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నట్టు అనౌన్స్ మెంట్ అందించారు.. అయితే వెన్యూలో చిన్న మార్పు ఉందని తాజాగా ఇలా అప్డేట్ అందించారు.. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో కాకుండా... పీవీకేకే ఇంజనీరింగ్ గ్రౌండ్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. ఇక ఈవెంట్ కు ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారనేది తెలియాల్సి ఉంది. మున్ముందు మరిన్ని అప్డేట్స్ అందించనున్నారు. ప్రస్తుతం నాని ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.
నాని - కీర్తి సురేష్ మరోసారి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర బ్యానర్స్ పై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతోనూ చిత్ర యూనిట్ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. మార్చి 30న చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
A slight change in the venue of DHOOM DHAAM DASARA celebrations⚠️
But Celebrations stay intact🥁
Grand Pre-Release Event tomorrow🔥
📍PVKK Engineering College Ground, Anantapur pic.twitter.com/3XONeMHkcg