కీర్తి సురేష్ కి బాలీవుడ్ లో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. చెప్పాలంటే ఆమెను అవమానించినట్లు అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం..
కీర్తి సురేష్ బేబీ జాన్ ప్రమోషన్స్ లో గట్టిగా పాల్గొంటుంది. కొత్త పెళ్లి కూతురు హనీ మూన్ కూడా స్కిప్ చేసి బేబీ జాన్ కోసం కష్టపడుతుంది. కీర్తి సురేష్ కమిట్మెంట్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా మంది హీరోయిన్స్ ప్రమోషన్స్ కి రావడానికి ఇష్టపడరు. సినిమా షూటింగ్ పూర్తి కాగానే తమ పని పూర్తి అయ్యిందనే భావనలో ఉంటారు.
కీర్తి సురేష్ మాత్రం నాకు కొత్తగా పెళ్లైందని సాకు చెప్పకుండా నిర్మాతలకు మేలు జరగాలని ముంబైలో చక్కర్లు కొడుతుంది. బేబీ జాన్ కీర్తి సురేష్ నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ. వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. బేబీ జాన్.. తమిళ హిట్ మూవీ తేరి రీమేక్. ఒరిజినల్ లో విజయ్ నటించాడు. తేరి సూపర్ హిట్ కావడంతో హిందీలో రీమేక్ చేశారు. బేబీ జాన్ చిత్రానికి కాళేశ్వరన్ దర్శకుడు. తేరి దర్శకుడు అట్లీ.. బేబీ జాన్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.
undefined
క్రిస్మస్ కానుకగా బేబీ జాన్ డిసెంబర్ 25న విడుదలైంది. చిత్రానికి మిక్స్ టాక్ వచ్చింది. ఫెస్టివ్ సీజన్లో కూడా బేబీ జాన్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. మూడు వారాల క్రితం విడుదలైన పుష్ప 2 లేటెస్ట్ రిలీజ్ బేబీ జాన్ కంటే మెరుగైన వసూళ్లు రాబట్టడం విశేషం. ప్రచారం కల్పించడం ద్వారా మూవీకి హైప్ క్రియేట్ చేయాలని వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ప్రయత్నం చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
పెళ్లయ్యాక 4 కోట్ల సంపాదన.. కీర్తి సురేష్ కి బ్యాడ్ లక్ తప్పలేదు
అయితే బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ కి అవమానం జరిగింది. ముంబై ఫోటోగ్రాఫర్స్ చాలా రూడ్ గా ఉంటారు. అసలు సెలెబ్స్ మనోభావాలు వారికి పట్టవు. ఎక్కడకు వెళ్లినా ఫోటోలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సందర్భం ఏదైనా కానీ.. ఆగి వాళ్లకు పోజులు ఇవ్వాల్సిందే. షాపింగ్, జిమ్, ఎయిర్ పోర్ట్ ఎక్కడా వదలరు. కాగా బేబీ జాన్ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన కీర్తి సురేష్ ఫోటో గ్రాఫర్స్ కి ఫోజులిచ్చారు. కీర్తి సురేష్ పేరును ఒకరు తప్పుగా పలికారు. కృతి అని సంభోదించాడు. రియాక్ట్ అయిన కీర్తి సురేష్...కృతి కాదు కీర్తి అన్నారు. ఓకే కీర్తి దోస అన్నాడు.
ఫోటోగ్రాఫర్ తీరుకు కీర్తి సురేష్ ఒకింత ఇబ్బంది ఫీల్ అయ్యారు. తప్పదు కాబట్టి అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోయింది. కాగా కావాలని కూడా అక్కడి మీడియా సౌత్ హీరోలు, హీరోయిన్స్ ని అవమానిస్తారు. ఉద్దేశపూర్వకంగా కూడా కీర్తి సురేష్ పేరును ఫోటోగ్రాఫర్ తప్పుగా పలికి ఉండొచ్చు. కాగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి సైతం అవమానం ఎదురైంది. కపిల్ శర్మ తన షోలో అట్లీ శరీర రంగుపై సెటైర్ వేశాడు. అట్లీ సున్నితంగా కౌంటర్ ఇచ్చాడు. కపిల్ శర్మ కామెంట్స్ పై తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి.
మరోవైపు కీర్తి సురేష్ ఇటీవల పెళ్లి పీటలు ఎక్కారు. తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్ తో ఏడడుగులు వేసింది. ఆంటోని దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త అని సమాచారం. గత 15 ఏళ్లుగా వీరు రిలేషన్ లో ఉన్నారట. కానీ ఎప్పుడూ కీర్తి సురేష్ తన లవ్ మేటర్ బయటపెట్టలేదు. డిసెంబర్ 12న గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం జరిగింది. కీర్తి సురేష్ పెళ్ళికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు.
కీర్తి సురేష్ పీక్స్ లో ఉంది. ఆమె తమిళంలో కన్నివిడి, రివాల్వర్ రీటా చిత్రాలు చేస్తుంది. పెళ్లి అనంతరం కూడా నటన కొనసాగిస్తుందా... లేక గుడ్ బై చెబుతుందా అనేది చూడాలి. కీర్తి సురేష్ కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిన దాఖలాలు లేవు. తెలుగులో ఆమెకు క్రేజ్ తగ్గింది.