‘వీరసింహారెడ్డి’ థర్డ్ సింగిల్ ప్రోమో.. మాస్ బీట్ తో దుమ్ములేపుతున్న ‘మా బావ మనోభావాలు’!

Published : Dec 23, 2022, 10:54 PM IST
‘వీరసింహారెడ్డి’ థర్డ్ సింగిల్ ప్రోమో.. మాస్ బీట్ తో దుమ్ములేపుతున్న ‘మా బావ మనోభావాలు’!

సారాంశం

నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ నుంచి థర్డ్ సింగిల్ ప్రొమో విడుదలైంది. రేపు ఫుల్ సాంగ్ విడుదల కానుండగా.. తాజాగా ప్రొమోను విడుదల చేసి పాటపై ఆసక్తిని పెంచారు. యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది.  

వచ్చే ఏడాది సంక్రాంతి  కానుకగా నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న ‘వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ‘అఖండ’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన  బాలయ్య ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy)తో మాసీజం చూపించబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ర మాలినేని డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది.

బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ కు దుమ్ములేచిపోయే రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా సినిమాలోని పాటు ఆడియెన్స్ ను బాగా అలరిస్తున్నాయి. గతంలో వచ్చిన ‘జై బాలయ్య’.. రీసెంట్ గా వచ్చిన  ‘సుగుణ సుందరి’ పాటలు దుమ్ములేపుతున్నాయి. థర్డ్ సింగిల్ గా ‘మా బావ మనోభావాలు’ సాంగ్ నూ రేపు విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా  ప్రోమోను వదిలారు. 

మాస్ బీట్ తో వస్తున్న Maa Bava Manobhavalu ప్రొమోలో తొలి పల్లవి ఆకట్టుకుంటోంది. ట్యూన్ కూడా క్యాచీగా ఉంది. ప్రోమోలో బాలకృష్ణ వేసిన మాస్ స్టెప్స్ కు దుమ్ములేచిపోతోంది. స్పెషల్ సాంగ్ గా రాబోతోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక ఫుల్ సాంగ్ ను రేపు మధ్యాహ్నం 3:19 గంటలకు విడుదల చేయనున్నారు. చిత్రంలో బాలయ్య సరసన గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జవనరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?