
కన్నడలో బ్లాక్ బాస్టర్ చిత్రాలను నిర్మిస్తున్న ‘హోంబాలే ఫిల్మ్స్’ (Hombale films) మంచి గుర్తింపు పొందుతోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను నిర్మిస్తున్న ఈ బ్యానర్ లో ‘కేజీఎఫ్’,‘కాంతార’ చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ఇక కేజీఎఫ్ తో రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఆ వెంటనే ‘కాంతార’తో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు.
అయితే, ‘హోంబాలే ఫిల్మ్స్’ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) తమ సంస్థ భవిష్యత్ కార్యచరణను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఇకపై అన్ని దక్షిణ భాషల్లోనూ సినిమాను నిర్మించేందుకు సంస్థ ప్రణాళికులు రూపొందిస్తోందన్నారు. సినీ ఇండస్ట్రీలో మున్ముందు మరింత డెవలప్ మెంట్ ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో రూ.3000 కోట్ల పెట్టుబడితో సినిమాలను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. రానున్న ఐదేండ్లలో ఈ టార్గెన్న పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.
విభిన్న కథలను తెరకెక్కిస్తూ.. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ‘హోంబాలే ఫిల్మ్స్’ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ బలంగా మారుతోంది. ప్రతి ఏడాది ఐదారు సినిమాలను నిర్మించబోతున్నారంట. ఇప్పటికే కన్నడతో పాటు మలయాళం, తెలుగులోనూ సినిమాలను ప్రారంభించారు. తెలుగులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ నిర్మిస్తు విషయం తెలిసిందే. అలాగే కన్నడలో ‘భగీర’,‘రిచార్డ్ ఆంటోని’ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇక మలయాళంలో ‘టైసన్’,‘ధూమమ్’ చిత్రాలతో ఎంట్రీ ఇవ్వనుంది.