
అల్లు అర్జున్(Allu Arjun) కెరీర్ లో పుష్ప స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ముఖ్యంగా పుష్ప హిందీ వర్షన్ సక్సెస్ కావడం అల్లు అర్జున్ కి కలిసొచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా పుష్ప బాలీవుడ్ లో విడుదలై మెల్లగా పుంజుకుంది. పుష్ప హిందీ వర్షన్ రన్ ముగిసేనాటికి వంద కోట్ల మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. పుష్ప మూవీ ఫస్ట్ పాన్ ఇండియా హాట్ తోపాటు ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇక పుష్ప సీక్వెల్(Pushpa 2) ఆగష్టు నుడి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. పార్ట్ 1 వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో పార్ట్ 2 మరింత ఉన్నతంగా తెరకెక్కించనున్నారు. పుష్ప 2 బడ్జెట్ దాదాపు రూ. 350 కోట్లని అంటున్నారు. ముందుకు అనుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కూడా చేశారట. కాగా పుష్ప ఫ్రాంచైస్ లో మూడో పార్ట్ కూడా ఉందని నటుడు ఫహద్ ఫాజిల్ తెలియజేశారు.
దర్శకుడు సుకుమార్ పుష్ప పార్ట్ 3కి అవకాశం ఉందని, కథలో ఆ పరిధి ఉందని ఫహద్ ఫాజిల్ తో తెలియజేశారట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ వెల్లడించారు. ఇక ఫహద్ ఫాజిల్ కామెంట్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. పార్ట్ వన్ లో ఫహద్ కేవలం క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. పార్ట్ 2 లో ఫహద్-అల్లు అర్జున్ ఆధిపత్య పోరే ప్రధానమని తెలుస్తుంది. పార్ట్ 1 లో సైతం కొద్దిసేపు పాత్రలో ఫహద్ మెరుపులు మెరిపించాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప 2 లో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 2024లో పుష్ప పార్ట్ 2 విడుదల కానుంది. సునీల్, అనసూయ, విజయ్ సేతుపతి పార్ట్ 2 లో కీలక రోల్స్ చేయనున్నారు.