
మేజర్ సినిమా కిక్కు గట్టిగా ఎక్కింది అడివి శేష్ కి. మేజర్' సినిమా సాధించిన భారీ విజయంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు యంగ్ స్టార్. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన ఈ సినిమాను శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేశాడు. సాధించింది. ఆ తరువాత సినిమాగా అడివి శేష్ హిట్ 2 చేస్తున్నాడు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి శేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
క్షణం,గూఢచారి, మేజర్ ఇలా అడవి శేష్ సినిమాలు ఏవి చూసుకున్నా. డిఫరెంట్ జానర్ లో ఉంటాయి. మంచి కథ, కథనాలుఉన్న సినిమాలు చేస్తుంటాడు అడివి. అవే అతన్ని అందరికంటే స్పెషల్ యాక్టర్ అనే ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ఒక ప్రత్యేకమైన జోనర్లో ముందుకు వెళుతున్నఈ హీరోకు అవే జోనర్లు సక్సెస్ ను కూడా తెచ్చిపెడుతుండటంతో ఆయన కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు.
ఇక హిట్ 2 సినిమా సంతగి అయిపోయింది. కాని తాను నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలో మాత్రం పాన్ ఇండియా అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే గూఢచారి 2 పై దృష్టి పెట్టినట్టుగా సమాచారం. అడివి శేష్ హీరోగా 2018 లో వచ్చిన గూఢచారి మంచి సక్సెన్ ను సాధించింది. ఈ సినిమాను కూడా మేజర్ సినిమా దర్శకుడు శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
అంతే కాదు గూఢచారి ఇక ఇదే టైటిల్ తో ఫ్రాంచైజీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారట. మొత్తానికి అడివి శేష్ టాలీవుడ్ మాత్రమే కాకుండా.. ఇక దేశమంతా తనకంటూ ఒక జోనర్ ను సెట్ చేసుకున్నట్టే అనుకోవాలి. గూఢచారి పాన్ ఇండియా రేజ్ లో హిట్ కొడితే.. అడివి శేష్ ఇమేజ్ ఓ రేంజ్ లో పెరగడం ఖాయం అంటున్నరు సినీ జనాలు.