కేన్స్ లో భారత్ కి దక్కని చోటు!

Published : May 14, 2019, 09:43 AM IST
కేన్స్ లో భారత్ కి దక్కని చోటు!

సారాంశం

అత్యంత ప్రతిష్టాత్మక జరిగే 'కేన్స్' చలన చిత్రోత్సవంలో ఈసారి భారత్ కి చోటు దక్కలేదు. 

అత్యంత ప్రతిష్టాత్మక జరిగే 'కేన్స్' చలన చిత్రోత్సవంలో ఈసారి భారత్ కి చోటు దక్కలేదు. 72వ కేన్స్ ఫెస్టివల్ ఫ్రెంచ్ రివేరాలో మే 14న ప్రారంభం కానుంది. మే 25వరకు చిత్రోత్సవం కొనసాగనుంది.

ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తీసిన ఉత్తమ చిత్రాలను ప్రదర్శించబోతున్నారు. అయితే ఈ ఏడాది కేన్స్ కి భారత్ తరఫున ఒక్క సినిమా కూడా ఎంపిక కాలేదు. అన్ని దేశాలకు చెందిన సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.

'కేన్స్' జ్యూరికి ప్రముఖ మెక్సిన్ దర్శకుడు అలెజాండ్రో అధ్యక్షత వహించబోతున్నారు. గతంలో అలెజాండ్రో ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఈ వేడుకకు ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఎడ్వర్డ్ బాయర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు.

భారత్ నుండి కేన్స్ కి దీపికా పడుకొనే, సోనం కపూర్, కంగనా రనౌత్, ఐశ్వర్యారాయ్, హీనా ఖాన్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉంది.  

PREV
click me!

Recommended Stories

Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్