ఒక్క హీరోకి ఆరుగురు హీరోయిన్ల లిప్ లాక్స్.. ముద్దుల్లో ముంచెత్తారట!

Siva Kodati |  
Published : May 14, 2019, 09:33 AM ISTUpdated : May 14, 2019, 10:00 AM IST
ఒక్క హీరోకి ఆరుగురు హీరోయిన్ల లిప్ లాక్స్.. ముద్దుల్లో ముంచెత్తారట!

సారాంశం

నువ్విలా, రామ్ లీల చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ ప్రస్తుతం ఓ రొమాంటిక్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. హవీష్ నటిస్తున్న తాజా చిత్రం 'సెవెన్'. ఈ చిత్రంలో ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. 

నువ్విలా, రామ్ లీల చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ ప్రస్తుతం ఓ రొమాంటిక్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. హవీష్ నటిస్తున్న తాజా చిత్రం 'సెవెన్'. ఈ చిత్రంలో ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రంలో రొమాన్స్ ఎలా ఉండబోతోందో అని. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఉంటూ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ ట్రైలర్ లో హీరో పలువురు అమ్మాయిలతో రొమాన్స్ చేసే సీన్స్ చూపించారు. 

ఈ చిత్రంలో రెజీనా, నందితశ్వేత, త్రిధా చౌదరి, పూజిత పొన్నాడ, అనీషా అంబ్రోస్, అధితి ఆర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఆరుగురు హీరోయిన్లు హీరో హవీష్ తో లిప్ లాక్ సన్నివేశాల్లోనటించారట. ట్రైలర్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ మాత్రమే చూపించారు. చిత్రంలో ఇంతకు మించి ఘాటు రొమాన్స్ ఉందని టాక్. 

ఒక చిత్రంలో హీరోతో ఆరుగురు హీరోయిన్లు ముద్దు సన్నివేశాల్లో నటించడం సంచలనమే. రొమాన్స్, క్రైం అంశాలని మిక్స్ చేస్తూ దర్శకుడు నజర్ షఫీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఇటీవల బోల్డ్ కంటెంట్ తో ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ముద్దు సన్నివేశాలు సెవెన్ చిత్రానికి ఏ స్థాయి విజయాన్ని కట్టబెడతాయో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

The RajaSaab బాక్సాఫీసు టార్గెట్‌ ఇదే, ప్రభాస్‌ రేంజ్‌ ఇలా ఉంటది.. ఏమాత్రం తేడా కొట్టినా మునిగిపోవాల్సిందే
'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'