ఆ రూమర్ వల్లే ‘వాల్మీకి’నుంచి పూజా త‌ప్పుకుందా?

Published : May 14, 2019, 09:29 AM IST
ఆ రూమర్ వల్లే  ‘వాల్మీకి’నుంచి పూజా త‌ప్పుకుందా?

సారాంశం

వరస సక్సెస్ లతో  హీరోయిన్ పూజా హెగ్డే దూసుకుపోతోంది. 

వరస సక్సెస్ లతో  హీరోయిన్ పూజా హెగ్డే దూసుకుపోతోంది. మహేష్ తో ఆమె చేసిన  ‘మహర్షి’ చిత్రం ఘన విజయం సాధించటంతో ఆమె క్రేజ్ రెట్టింపు అయ్యింది. మరోపక్క   అల్లు అర్జున్‌, ప్రభాస్‌ వంటి స్టార్స్ తో కలిసి నటిస్తోంది. ఇలా మంచి జోరు మీదున్న పూజ త్వరలోనే ‘వాల్మీకి’ కోసం రంగంలోకి దిగనున్నట్టు వార్తలు వచ్చాయి.  అయితే ఈ లోగా పూజా తప్పుకుందనే వార్త గుప్పుమంది.

నిజానికి పూజా హెగ్డేకి ఈ రోజు ఇంత క్రేజ్ రావ‌డానికి కార‌ణం దర్శకుడు హ‌రీష్‌ శంక‌ర్‌ అనేది కాదనలేని సత్యం. తెలుగులో సక్సెస్  లేక బాలీవుడ్‌కి వెళ్లిన పూజని మళ్లీ  దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమాలో హీరోయిన్‌గా తీసుకొని వచ్చి హిట్ ఇచ్చి నిలబెట్టాడు. ఆ త‌ర్వాత అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి లతో మెరిసిపోయింది. దాంతో  ఈ భామ‌ని తన తాజా చిత్రం వాల్మీకి ఒక కీల‌క పాత్ర‌లో తీసుకోవాల‌నుకున్నాడు హ‌రీష్ శంక‌ర్‌.

అయితే పూజ కు వాల్మీకి చిత్రంలో పదిహేను రోజులకు కానూ రెండు కోట్లు ఇచ్చారంటూ వచ్చిన టిట్ బిట్స్ చదివి కోపం తెచ్చుకుందిట. ఆమె రూమర్స్ ని అంత ఈజిగా తీసుకోవటం లేదు. కొద్ది రోజుల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిదంటూ వచ్చిన వార్తలను సైతం ఆమె సీరియస్ గా తీసుకున్నారు.  దాంతో తన రెమ్యునేషన్ గురించి బయిట ఇలా ప్రచారం జరుగుతోందని, తను ఆ సినిమా చేయనని హరీష్ కు చెప్పిందట.  వెంటనే హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా ఆ వార్తను ఖండించి, ఆమె సినిమా చేస్తోందా లేదా అన్నది నిర్మాతలు ప్రకటిస్తారని అన్నారు.  దాంతో పూజాహెగ్డే వాల్మీకీ సినిమాలో ఉంటుందా లేదా అనేది ప్రశ్నగా మారింది. 

వరుణ్‌తేజ్‌  హీరోగా హరీష్‌ శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో విజయవంతమైన ‘జిగర్తాండ’కి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో వరుణ్‌తేజ్‌తోపాటు తమిళ హీరో  అథర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు.  ఇందులో వరుణ్‌తేజ్‌ నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో సందడి చేయనున్నట్టు సమాచారం. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి