Akhanda Movie : అఖండ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం (వీడియో)

Siva Kodati |  
Published : Dec 05, 2021, 11:22 PM IST
Akhanda Movie : అఖండ ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం (వీడియో)

సారాంశం

శ్రీకాకుళంలో (srikakulam) అఖండ సినిమా ప్రదర్శిస్తోన్న రవిశంకర్‌ థియేటర్‌లో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. తెరవెనుక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు

నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) నటించిన అఖండ (akhanda) సినిమా గురువారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మార్నింగ్ షోకే హిట్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోతున్నాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో సందడిగా నెలకొంటొంది.  బాలయ్య ని బోయపాటి (boyapati srinu) చూపించిన నెక్స్ట్ లెవెల్ మాస్ ప్రెజెంటేషన్ లో తనకి తానే సాటి అని మళ్ళీ ప్రూవ్ చేశారు. రెండు వేరియేషన్ లో కూడా బాలయ్య లోని మాస్ విశ్వరూపం దేనికదే డిఫరెంట్ గా సాలిడ్ ట్రీట్ ని అందించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.

అయితే శ్రీకాకుళంలో (srikakulam) అఖండ సినిమా ప్రదర్శిస్తోన్న రవిశంకర్‌ థియేటర్‌లో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. తెరవెనుక ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. సౌండ్‌ సిస్టమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన థియేటర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read:బాలయ్య కంటే ముందే అఘోరాగా చేసిన చిరు, నాగ్, వెంకీ.. మరి ఆ చిత్రాలు హిట్టా ఫట్టా?

ఇకపోతే ఈ సినిమాని కేవలం అభిమానులే కాదు కొందరు అఘోరాలు సినిమా చూసేందుకు వచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో సందడి చేశారు. అఘోరాలూ కూడా బాలయ్య ఫ్యాన్స్‌ అయ్యారంటూ అభిమానులు కేకలేశారు. ఇక సినిమాకు వచ్చిన  అఘోరాలు.. బాలయ్య అభిమానులతో కాసేపు ముట్టించారు. ఆ తరువాత అఖండ సినిమాను చూసి.. ఆనందించారు. ఈ సినిమా కోసమే థియేటర్‌కు వచ్చామంటూ చెప్పారు. 

అభిమానులతో కలిసి శివ నామస్మరణ చేశారు. తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక అఘోరాలు అఖండ సినిమా చూడ్డానికి రావడం చూసి బాలయ్య హార్డ్‌ కోర్‌ అభిమానులు ఫుల్ పండగ చేసుకుంటున్నారు. బాలయ్య పవర్‌ అంటే అదే అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. నిత్యం శివ నామస్మరణ చేసే అఘోరాలు.. బాలయ్య సినిమాకు రావడం.. ఆయనను వారు ఆశీర్వదించడమేనని అంటున్నారు.  బాలయ్యకు ఇప్పటికీ ఎప్పటికీ తిరుగేలేదని.. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు.

 

"

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..