ఎన్టీఆర్-చరణ్ మధ్య యుద్ధం... అసలు విషయం లీక్ చేసిన ఆర్ ఆర్ ఆర్ రైటర్!

Published : Jun 04, 2021, 09:30 AM IST
ఎన్టీఆర్-చరణ్ మధ్య యుద్ధం... అసలు విషయం లీక్ చేసిన ఆర్ ఆర్ ఆర్ రైటర్!

సారాంశం

రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ గురించి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆయన ఇచ్చిన హింట్స్ సినిమా హైప్ మరో స్థాయికి తీసుకెళ్లాయి. 


ఇద్దరు స్టార్ హీరోలు, పాన్ ఇండియా డైరెక్టర్, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ... ఇన్ని ప్రత్యేకతలు ఆర్ ఆర్ ఆర్ మూవీ సొంతం. ఎన్టీఆర్- రామ్ చరణ్ కొమరం భీమ్, రామరాజు పాత్రలు చేస్తుండగా దర్శకధీరుడు రాజమౌళి వినూత్నంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీగా అక్టోబర్ 13 నిర్ణయించారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశలో ఉంది. 


ఈ చిత్ర రచయిత, రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ గురించి పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆయన ఇచ్చిన హింట్స్ సినిమా హైప్ మరో స్థాయికి తీసుకెళ్లాయి. సాధారణంగా సినిమాలలో ఫైట్ సన్నివేశాలకు ప్రేక్షకులు చప్పట్లు, ఈలలు వేస్తారని, కానీ ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఫైట్ సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు కన్నీరు పెట్టుకుంటారని అన్నారు. 


పోరాట సన్నివేశాలకు ప్రేక్షకులు కన్నీరు పెట్టుకునేంత ప్రత్యేకత ఏముందని భావించిన వారికి, విజయేంద్ర ప్రసాద్ పరోక్షంగా సమాధానం చెప్పారు.  ఇద్దరు మంచివాళ్లైన అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటే బాధగా ఉంటుంది. ఇద్దరూ మరలా కలిసిపోతారని మనకు తెలుసు, అయినా వాళ్ళు భీకరంగా కొట్టుకోవడం కన్నీరు తెప్పిస్తుంది అన్నారు. 


ఎన్టీఆర్, చరణ్ ఇంట్రో వీడియోలలో ఒకరికి ఒకరిని అన్నదమ్ములుగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్, చరణ్ ఒకరితో ఒకరు తలపడనున్నారని అర్థం అవుతుంది. ఇద్దరు టాప్ స్టార్స్ మధ్య జరిగే ఆ యుద్ధాన్ని రాజమౌళి ఎలా చిత్రీకరించాడో చూడాలి. 


 

PREV
click me!

Recommended Stories

Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?