కన్నడ సినీ నటి జయ కన్నుమూత

By telugu teamFirst Published Jun 4, 2021, 8:32 AM IST
Highlights

ప్రముఖ కన్నడ సినీ నటి బి. జయ బెంగళూరులో కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె గురువారం మరణించారు. శుక్రవారం ఉదయం ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి.

బెంగళూరు: కన్నడ సినీ నటి బి. జయ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జరిగాయి. ఆమె వయస్సు 75 ఏళ్లు. ఆమె 350కి పైగా చిత్రాల్లో నటించారు. హాస్యనటిగా ఆమె మంచి పేరుంది. క్యారెక్టర్ యాక్టర్ గా కూడా ఆమె ప్రసిద్ధి పొందారు 

టీవీ సీరియల్స్ లో కూడా జయ నటించారు. వయోభారానికి సమస్యలతో ఆమె ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికత్స పొందుతూ జయ గురువారం తుది శ్వాస విడిచారు. 

జయ 1945లో కొల్లెగల్ లో జన్మించారు భక్త ప్రహ్లాద చిత్రంతో 1958లో సినీ ఆరంగేట్రం చేశారు. తొలి హాస్య నటీమణుల్లో జయ ఒక్కరు ఆమె టీఎన్ నరసింహ రాజు, ద్వారకీష్, డాక్టర్ రాజ్ కుమార్, కల్యాన్ కుమార్, ఉదయ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి ప్రముఖలతో కలిసి సినిమాల్లో నటించారు. 

చివరగా ఆమె 2018లో అమ్మ ఐ లవ్ యూ చిత్రంలో నటించారు. ఆమె ఇటీవల ఓ చిత్రం షూటింగులో పాల్గొన్నారు. ఆ చిత్రం విడుదల కావాల్సి ఉంది. గౌద్రు సినిమాలో నటనకు గాను ఆమెకు 2004 -05 రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. 

ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కన్నడ సాంస్కృతిక మంత్రి అరవింద్ లింబవలి, కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్ సునీల్ పురాణిక్ ఆమె మృతికి సంతాపం ప్రకటించారు 

click me!