వర్మ దెబ్బకి థియేటర్లు క్లోజ్!

By AN TeluguFirst Published May 4, 2019, 2:00 PM IST
Highlights

సంచలన దర్శకుడు వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రదర్శించినందుకు రెండు థియేటర్లు మూత పడబోతున్నాయి. 

సంచలన దర్శకుడు వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రదర్శించినందుకు రెండు థియేటర్లు మూత పడబోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. సినిమాపై నిషేధం ఉన్నా అడ్డుకోలేకపోయారని కడప జాయింట్ కలెక్టర్ పై ఈసీ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

ఎన్నికల నేపధ్యంలో కౌంటింగ్ ముగిసేవరకు రాజకీయ నేతల బయోపిక్ లు విడుదల చేయకూడదనే ఆదేశాలిచ్చింది ఎన్నికల కమిషన్. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ఏపీలో విడుదల చేస్తానని పట్టుబట్టారు.

దీనిపై ఈసీకి లెటర్ కూడా రాశారు. కానీ దానికి ఈసీ అంగీకరించలేదు. వర్మ మాత్రం థియేటర్లకు క్యూబ్ లు పంపించేశారు. అయితే థియేటర్ యాజమాన్యాలు మాత్రం సినిమాను ప్రదర్శించడానికి వెనుకడుగు వేశాయి. కానీ కడప పోరుమామిళ్లలోని వైసీపీ నేతలకు చెందిన రెండు థియేటర్లలో షోలను ప్రదర్శించారు.

దీనిపై ఈసీకి ఫిర్యాదు వెళ్లడంతో, నియమాలు ఉల్లంఘించి సినిమాను ప్రదర్శించినందుకు థియేటర్ల లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ పట్టించుకోకపోవడంతో ఆయనపై కూడా చర్యలు తీసుకోబోతున్నారు. మరికొన్ని చోట్ల కూడా సినిమాను ప్రదర్శించారనే ప్రచారం జరుగుతోంది. ఆ థియేటర్లపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

click me!