సినీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో థియేటర్లు ఓపెన్‌.. ఎప్పట్నుంచంటే?

Published : Jul 17, 2021, 04:34 PM ISTUpdated : Jul 17, 2021, 06:43 PM IST
సినీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో థియేటర్లు ఓపెన్‌.. ఎప్పట్నుంచంటే?

సారాంశం

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి థియేటర్ల ఓపెన్‌కి,  ఈ నెల 23 నుంచి కొత్త సినిమాల ప్రదర్శన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. 

తెలంగాణలో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం థియేటర్లకి అనుమతినిచ్చింది. తాజాగా దీనిపై మరింత క్లారిటీ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ అనుమతితో ఇక థియేటర్లని ఓపెన్‌ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి(ఆదివారం) థియేటర్లు ఓపెన్‌ చేయాలని,  ఈ నెల 23 నుంచి కొత్త సినిమాల ప్రదర్శన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. 

తెలంగాణ అంతటా 100 శాతం ఆక్యుపెన్సితో థియేటర్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తెలంగాణ ఫిలించాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. టాలీవుడ్ సినీ నిర్మాతలకు తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా థియేటర్ల పునఃప్రారంభానికి 100 శాతం సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
Thanuja: తనూజ అసలు రూపం బయట పడింది, బిగ్ బాస్ టైటిల్ గెలిచేందుకు అంతకి తెగించిందా ?