Ram The Warrior: రామ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త ఇది

Surya Prakash   | Asianet News
Published : May 08, 2022, 03:06 PM IST
Ram The Warrior: రామ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త ఇది

సారాంశం

  ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఎక్కువగా మాస్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.  


 యువ హీరో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం #RAPO19. దీని టైటిల్ ‘యోధుడు(The Warrior)’. తమిళ చిత్ర నిర్మాత లింగుసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో.. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్‌లో.. రామ్ పోతినేని పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ కు రంగం సిద్దమైంది.

రామ్ పుట్టిన రోజు మే 15. అంతుకు ముందు అంటే మే 14, 5:31 నిముషాలకు ఈ చిత్రం టీజర్ విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ ప్రకటన చేసారు.  రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ మూవీ కోసం రామ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.   ఇక ఎప్పుడైతే ఇస్మార్ట్ శంకర్ సినిమా విడుదలైందో.. అప్పట్నుంచే రామ్ తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఎక్కువగా మాస్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫోటోలల్లో రామ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. వీటిని చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. 

ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ‘ది వారియర్’ రామ్ కెరీర్‌లో ఓ డిఫరెంట్ సినిమా అవుతుందని ధీమాగా చెప్తున్న మేకర్స్.. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 14న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.   పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలు. ఆది పినిశెట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. కెరీర్‌లో ఫస్ట్ టైం రామ్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

దర్శకుడు గతంలో చేసిన రెండు తెలుగు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలో పూర్తిగా విఫలమయ్యాయి.పందెం కోడి 2 డబ్బింగ్ వెర్షన్ కూడా ప్రజల నుండి పెద్దగా ఆదరణ పొందలేదు. ఇలా లింగుస్వామికి గత కొంతకాలంగా ఎలాంటి హిట్ అందుకోలేదు. దీనితో అయినా ట్రాక్ లోకి రావాలని కోరుకుంటున్నాడు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్
మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్