Ramarao On Duty Song: జోరు చూపిస్తున్న మాస్ మహారాజ్, రామారావు ఆన్ డ్యూటీ నుంచి సొట్టబుగ్గల్లో సాంగ్ రిలీజ్

Published : May 08, 2022, 11:34 AM ISTUpdated : May 08, 2022, 11:36 AM IST
Ramarao On Duty Song: జోరు చూపిస్తున్న మాస్ మహారాజ్,  రామారావు ఆన్ డ్యూటీ నుంచి సొట్టబుగ్గల్లో సాంగ్ రిలీజ్

సారాంశం

రామారావు ఆన్ డ్యూటీ సినమాను  సూపర్ ఫాస్ట్ గా  కంప్లీట్ చేసేస్తున్నాడు మస్ మహారాజ్ రవితేజ. ఈ మూవీ నుంచి వరుసగా అప్ డేట్స్  కూడా ఇస్తున్నాడు. రీసెంట్ గా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు టీమ్.   

రామారావు ఆన్ డ్యూటీ సినమాను  సూపర్ ఫాస్ట్ గా  కంప్లీట్ చేసేస్తున్నాడు మస్ మహారాజ్ రవితేజ. ఈ మూవీ నుంచి వరుసగా అప్ డేట్స్  కూడా ఇస్తున్నాడు. రీసెంట్ గా స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు టీమ్. 

టాలీవుడ్ మాస్‌రాజ ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుసగా సినిమాల‌ను చేస్తూ బిజీగా గ‌డుపుతున్నాడు. ఏడాదికి రెండు సినిమాల‌ను రిలీజ్ చేయాలి అని టార్గెట్ గా పెట్టుకున్నట్టున్నారు రవితేజ, ఆ  విధంగా ర‌వితేజ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో నాలుగు సినిమాలున్నాయి. రిసెంట్ గా రిలీజ్ అయిన ఖిలాడీ నిరావపరిచి ప్లాప్ అందించింది. ఇక తరువాత సినిమాల విషయంలో జాగ్రత్తగా  అడుగులు వేస్తున్నాడు స్టార్. 

ఇక ఇప్పుడు మాస్‌రాజరామారావు ఆన్ డ్యూటీ తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాల‌ని క‌సితో ఉన్నాడు. శ‌ర‌త్ మండ‌వ అనే కొత్త    ద‌ర్శ‌కుడుగా పరిచ‌య‌మ‌వుతున్నాడు. రీసెంట్ ఈమూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది.  ఈ క్ర‌మంలో  ఏదో ఒక అప్‌డేట్‌తో టీమ్ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఇక  తాజాగా ఈ సినిమా నుంచి సోట్ట‌బుగ్గ‌ల్లో పాట‌ను మేక‌ర్స్ రిలీజ్  చేశారు.

 

ఈ మెలోడి సాంగ్‌ శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటుంది. హ‌రిప్రియా, న‌కుల్ అభ్యంక‌ర్ ఆల‌పించిన ఈ పాట‌కు క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి సాహిత్యం అందించాడు. సామ్ సీఎస్ ట్యూన్ మంచి ఫీల్‌ను క్రియేట్ చేస్తుంది. అంతకు ముందు రిలీజ్ అయిన బుల్ బుల్ తరంగ్ పాట‌కు అద్భుతమైన రెస్పాన్ వచ్చింది. ఇక ర‌వితేజ‌కు జోడీగా ఈ సినిమాలో  దివ్యాంక కౌశిక్, ర‌జీషా విజ‌య‌న్‌లు హీరోయిన్లుగా న‌టించారు. 

చాలా కాలం త‌ర్వాత సీనియ‌ర్ న‌టుడు వేణు తోట్టెంపూడి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. శ్రీ ల‌క్ష్మివెంక‌టేశ్వ‌రా సినిమాస్, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో కలిసి ర‌వితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రంలో ర‌వితేజ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా