సెన్సార్ పూర్తి చేసుకున్న ది వారియర్, ఇక రిలీజ్ కు సై...

Published : Jul 12, 2022, 11:44 AM IST
సెన్సార్ పూర్తి చేసుకున్న ది వారియర్, ఇక రిలీజ్ కు సై...

సారాంశం

ది వారియర్ మూవీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఇక రిలీజే తరువాయి. మూవీ రిలీజ్ కు కావల్సిన చివరి ఫార్మాలిటీ కంప్లీట్ అయ్యింది. ది వారియర్ మూవీ సెన్సాన్ కంప్లీట్ అయ్యింది.   

ది వారియర్ మూవీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఇక రిలీజే తరువాయి. మూవీ రిలీజ్ కు కావల్సిన చివరి ఫార్మాలిటీ కంప్లీట్ అయ్యింది. ది వారియర్ మూవీ సెన్సాన్ కంప్లీట్ అయ్యింది. 

ఎందుకో ఈ మధ్య యాక్షన్ సినిమాలపై మనసు పారేసుకున్నాడు హీరో  రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ తరువాత మరో మాస్ మూవీగా రెడ్ మూవీ చేశాడు. కాని ఈ సినిమా అనుకన్న ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా సరే మాస్ ఇమేజ్ ను పట్టుకుని వదలడం లేదు రామ్. ఒకప్పుడు చాక్లెట్ బాయ్ అనిపించుకున్న హీరో.. ఇప్పుడు యాక్షన్ హీరోగా మారిపోయాడు. రెడ్ ఫెయిల్యూర్ తరువాత కూడాయాక్షన్ సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడు.  తన తాజా మూవీగా ది వారియర్ రిలీజ్ కు రెడీ అయ్యింది. 

శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. తమిళ దర్శకుడు లింగుసామికి తెలుగులో ఇది డైరెక్ట్ గా ఫస్ట్ మూవీ. ఈ మూవీ రిలీజ్ కు అన్ని క్లియర్ అయ్యాయి.  

తాజాగా ది వారియర్ మూవీ  సెన్సార్ పనులను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా  తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మూవీ టీమ్.  సెన్సార్ లో  U/A సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఇక థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. రామ్ ఫస్టు టైమ్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ఇది.  ది వారియర్ లో రామ్ జోడీగా.. రేడియో జాకీ పాత్రలో  కృతి శెట్టి కనిపించనుంది.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమూవీ  పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియన్స్ కి  ఈ పాటలు బాగానే కనెక్ట్ అయ్యాయి. రెడ్ తరువాత భాగా ఆలోచించి ఈ కథకు ఒకే చెప్పాడు రామ్. మరి ఈసినిమా రామ్ కు వెరీ.. స్పెషల్. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఇస్మార్ట్ హీరోతో పాటు.. ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Nagadurga: నిర్మాతకు 15 కండీషన్స్ పెట్టిన నాగదుర్గ.. హీరోయిన్‌గా `ఇడుపుకాయితం` స్టార్ట్
Vishnu Vishal: అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్‌ హీరో.. మూడేళ్లు దాచిన నిజం బట్టబయలు