టాప్ వన్ లో ట్రెండ్ అవుతున్న అంజలి స్పెషల్ సాంగ్.. మాస్ స్టెప్పులకు మాసీవ్ రెస్పాన్స్..

Published : Jul 12, 2022, 11:15 AM ISTUpdated : Jul 12, 2022, 11:18 AM IST
టాప్ వన్ లో ట్రెండ్ అవుతున్న అంజలి స్పెషల్ సాంగ్.. మాస్ స్టెప్పులకు మాసీవ్ రెస్పాన్స్..

సారాంశం

యంగ్ హీరో నితిన్, కృతి శెట్టి  జంటగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన స్పెషల్ సాంగ్ ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది. టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది.  

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) మాస్ లుక్ లో అలరించబోతున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఈ మూవీపై నితిన్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ కు కూడా ఆడియెన్స్ నుంచి మాసీవ్ రెస్పాన్స్ వస్తోంది. మాస్ యాంగిల్ లో నితిన్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా పడలేదు. Macherla Niyojakavargam తో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. 

ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ దశలో ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్ ను పంపుతున్నారు. ఈ మేరకు జూలై 9న మూవీ నుంచి స్పెషల్ నెంబర్ ను వదిలారు. ‘రా రా రెడ్డి’ అనే టైటిల్ తో వచ్చిన ఐటెం సాంగ్ లో అంజలి అందాలతో అదరగొట్టింది. నితిన్, అంజలి మాస్ స్టెప్పులకు ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అయితే ఈ సాంగ్ యూట్యూబ్ లోకి వచ్చిన రోజు కాస్తా నెమ్మదించినా.. ప్రస్తుతం మాత్రం టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది.

Ra Ra Reddy ఐటెం సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ క్యాచీగా ఉండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించగా.. కాసర్ల శ్యామ్ ఈ పాటకి లిరిక్స్ రాశారు. లేడీ సింగర్ లిప్సికా అదర్భుతంగా పాడింది. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతున్న ఈ సాంగ్ ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. #1లో రా రా రెడ్డి సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. సంగీత ప్రియులు సాంగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  
  
నితిన్ తన సొంత ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మించారు. ప్రొడ్యూసర్ గా సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి వ్యవహరించారు. గ్లామర్ బ్యూటీలు Krithi Shetty, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. మహాతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల ఆగష్టు 12న ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ కూడా జోరుగానే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది.  

 

PREV
click me!

Recommended Stories

Nagadurga: అమ్మో సినిమాల్లోకి రాగానే ఇన్ని షరతులా?
July Telugu Movies: నాగబంధం నుంచి రావు బహదూర్ వరకు, జూలై లో క్రేజీ సినిమాల సందడి.. అఖిల్ కి గట్టి పోటీ